ఔను! లోకేష్ కి అంత సీన్‌లేదని చెబుతున్నా జగన్ పార్టీ వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. గురువారం మీడియాతో మాట్లాడిన అంబటి చంద్రబాబు అండ్ ఫ్యామిలీపై ఫైరైపోయారు. ముఖ్యంగా లోకేష్ ను ఆయన టార్గెట్ చేసేశారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన ఓ పర్యటనలో.. లోకేష్ మాట్లాడుతూ.. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ వ్యాఖ్యలు కుమ్మరించారు. ఈ వ్యాఖ్యలపై అంబటి నిప్పులు చెరిగారు. అసలు జగన్ ను విమర్శించే సీన్ - స్థాయిలు లోకేష్ కి లేవని ధ్వజమెత్తారు.
వాస్తవానికి నారా వంశానికే పదవులపై వ్యామోహం పెరిగిపోతోందని అంబటి దుయ్యబట్టారు. అభివృద్ధికి అడుగడుగునా జగన్ అడ్డుతగులు తున్నాడని లోకేష్ చేస్తున్న విమర్శ పూర్తిగా అబద్ధమని అన్నారు. రాజధానికి అడ్డుతగులుతున్నారని, ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నారని అనడం కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకి - తమ పార్టీ అధినేత జగన్ కి అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అంబటి ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి - దుబారా ఖర్చు - లంచగొండితనాలనే తాము ప్రశ్నిస్తున్నామన్నారు.
రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పిన అంబటి బందరు పోర్టు కోసం 1200 ఎకరాలు చాలని నాడు విపక్షంలో ఉండగా చంద్రబాబు పెద్ద ఎత్తున రగడ చేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు అలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కున్నారని అంబటి విమర్శించారు. ఈ భూమి సేకరణ వెనుక ఉద్దేశమేంటో చంద్రబాబు చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. చంద్రబాబు - ఆయన కుమారుడు పోలీసు బందోబస్తు లేకుండా ప్రజల వద్దకు వెళితే ప్రజలు తరిమి తరిమి కొడతారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/