ఏపీ అధికారపక్షంపై జగన్ బ్యాచ్ గురి పెట్టిన రాజధాని భూదురాక్రమణ వ్యవహారం రాజకీయంగా అధికార.. విపక్షాల మధ్య సూటిపోటి మాటలకు వేదికగా మారింది. నువ్వొకటి అంటే నేను రెండు అంటా అన్న చందంగా ఏపీ అధికార.. విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ ఎమ్మెల్సీ.. అనంతపురం జిల్లా సీనియర్ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో భూమి కొన్నారన్న సాక్షి ఆరోపణలపై పయ్యావుల విరుచుకుపడుతూ.. తాను మగాడిలా కొన్నానని.. తానేమీ బినామీ పేర్లతో కొనలేదని.. తన కొడుకు పేరు మీదనే భూమి కొన్నానని పయ్యావుల వ్యాఖ్యానించిన నేపథ్యంలో అంబటి చెలరేగిపోయారు.
పయ్యావుల మీద అంబటి ఎంతగా చెలరేగిపోయారన్నది మొత్తంగా ఆయన మాటల్లోనే చూస్తే..
మీరు మగాడిలా కొంటే.. మరి బినామీ పేర్లతో కొన్న చంద్రబాబు.. లోకేశ్.. నారాయణ పరిస్థితి ఏంటి? వాళ్లు మగాళ్లు కాదా? మగాడిలా కొన్నానని అంటున్నావ్.. మంత్రి రావెల భార్య కూడా డైరెక్ట్ గా నీలానే కొన్నారు. అసలు అక్కడ ఎందుకు కొన్నారు? రాజధాని వస్తుందని ముందే తెలిసి కొన్న మాట వాస్తవమా? కాదా?
రాత్రి 11 గంటల వరకు సాక్షిలో స్ట్రింగర్ నుంచి వాచ్ మన్ వరకు అందరి దగ్గరకు కాళ్ల బేరానికి వచ్చింది నిజం అవునా?కాదా? ఉరవకొండకు వచ్చి చర్చించేందుకు సిద్ధం. నీ మొహానికి జగన్ రావాల్సిన అవసరంలేదు. నీకు.. సిగ్గు.. శరం.. చీము.. నెత్తురుఉంటే ఉరవకొండలోనే నీ భూముల గురించి చర్చిద్దాం రా..!
రాయలసీమలో పుట్టినవాడివి. రాజధాని ప్రాంతం గురించి ముందే తెలుసుకొని.. అక్కడ భూములు కొనే నక్కజిత్తులు ఎందుకు వచ్చాయి.? మగాడినని ప్రగల్భాలు పలకలం కాదు.. చేతల్లో చూపిస్తావా?
కడపలో ఉన్న బినామీ మైనింగుల గురించి.. సీబీఐ దృష్టికి రాని కొన్ని విషయాల్ని బయటకు తెస్తానని చెబుతున్నావ్.. ఇన్నాళ్లు గాడిదలు కాస్తున్నారా? ఇప్పటివరకూ ఎందుకు బయటకు తీసుకురాలేదు? ఇన్నాళ్లకు ఎందుకు దాచావు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా?