నలుగురు నడిచే దారిలో స్పెషల్ ఏముందంటూ.. ఏపీ రాజధాని విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా రియాక్ట్ కావటం తెలిసిందే. దక్షిణాఫ్రికా మోడల్ లో ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పటం తెలిసిందే. ఈ ప్రకటనపై పలువురు హర్షం చేస్తుంటే.. ఏపీ విపక్షంతో పాటు.. జనసేన అండ్ కో.. ఇతరులు మాత్రం పెదవి విరుస్తున్నారు.
ఇదిలా ఉంటే కొత్త రాజధానుల్ని ప్రకటించిన ప్రకటన మీద రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు తీసుకొని ఇలా చేస్తారేంటంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు కూడా. ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్న మూడు రాజధానులపై విమర్శలు చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మూడు రాజధానులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని.. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతుందన్నారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారిపై మండిపడ్డ అంబటి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..
% అమరావతిని సింగపూర్ చేస్తానని చంద్రబాబు చాలాసార్లు చెప్పినా.. దాని అమలు మాత్రం చేయలేకపోయారు. మేం చెప్పిన ప్రతిదాన్నివ్యతిరేకించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది.
% తినడానికి తిండి లేకున్నా చంద్రబాబు పరమాన్న అడిగాడు. మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడం కాదనే విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి.
% రాజధాని అంటే పరిపాలన భవనాలు నిర్మంచుకోవడం. శాసనసభ, సచివాలయ నిర్మాణం.. ముఖ్యమైన భవనాలు నిర్మించడం. రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు.
% అమరావతి అనేది స్కాం అని, అమరావతిలో బాబు ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారు. పేదల భూములు భయపెట్టి టీడీపీ నాయకులు లాక్కున్నారు. ఇప్పుడు టీడీపీ నేతల భూ కుంభకోణం బయటకు వస్తుందన్న భయంతోనే బాబు భయపడుతున్నారు.
% అమరావతి ప్రజా రాజధాని అనేది పెద్ద భూ కుంభకోణం. రాజధానిలో నిరసన కార్యక్రమాలు తీరు, బాష చూస్తే విషయం తెలిసిపోతుంది.
% వారు కావాలనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ఉంది. రైతుల ముసుగులో కొంతమంది సీఎం జగన్మోహన్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వారిని చూస్తూ ఉరుకోము.
% రాజధాని మారిస్తే రైతులు నష్టపోరు. రైతులు ముసుగులో భూములు కొన్న టీడీపీ నాయకులు మాత్రమే నష్టపోతారు. అన్ని ప్రాంతాలు బాగుండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు.