నిద్ర పోతున్న వారిని కూడా తట్టి లేపేలా.. వారిలో ఆవేశం తన్నుకు వచ్చేలా వ్యాఖ్యలు చేయటం కొంతమంది నేతలకు అలవాటు. కావాలని చేస్తారో.. అనుకోకుండా అలాంటి మాటలు అంటారో కానీ.. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓపక్క ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా మీద భారీ ఎత్తున పోరాటం చేసేందుకు వ్యూహాలు రచిస్తూ.. మధ్యమధ్యలో పెద్ద ఎత్తున సభల్ని నిర్వహించటం ద్వారా ప్రజల్లో హోదా సెంటిమెంట్ ను మరింత రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.
హోదా విషయంలో జగన్ తన ప్రయత్నాలు తాను చేస్తుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకోవైపు హోదా విషయంలో సీరియస్ గా పోరాడేందుకు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. విశాఖ సభ జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే.. హోదా ఎపిసోడ్ ముగిసిన అధ్యాయంగా తేలిగ్గా తీసేయటం ద్వారా వెంకయ్య సీమాంధ్రులకు సురుకు పుట్టేలా చేశారని చెప్పాలి. పాచిపోయిన లడ్డూ లాంటి ప్యాకేజీతో హోదా లెక్క సరిపోయిందని చెబుతున్న మోడీ బ్యాచ్ పై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వెంకయ్య చేసిన ‘‘ముగిసిన అధ్యాయం’’ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖలో ‘‘జై ఆంధ్రప్రదేశ్’’ సదస్సు జరిగితే ప్రజలు విజయవంతం చేశారని.. దీంతో వెంకయ్య విచిత్రంగా మాట్లాడుతున్నారన్నారు. వెంకయ్య చేసిన వ్యాఖ్య సరికాదన్న ఆయన.. హోదా సాధించే వరకూ జగన్ విశ్రమించరని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/