వ‌లంటీర్లు.. వైసీపీ నేత‌లే.. గుట్టు విప్పేసిన మంత్రి వ‌ర్యులు

Update: 2022-07-01 02:30 GMT
ఏపీలో వ‌లంటీర్ల నియామ‌కం.. వారు చేస్తున్న‌ప‌నులు వంటి అంశాల‌పై తీవ్ర‌స్థాయిలో ర‌చ్చ జ‌రుగుతోంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌యంలో మౌనంగా ఉంటే.. అధికార ప‌క్షంలోనే వ‌లంటీర్ల పై కుమ్ములాట‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వ‌లంటీర్ల వ‌ల్ల‌.. త‌మ‌కు ప్రాధాన్యం పోయింద‌ని.. వ‌లంటీర్లు త‌మ ను అవ‌మానిస్తున్నార‌ని.. ఇలా.. ఎమ్మెల్యేలు.. రోడ్డున ప‌డుతున్నారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ కార‌ణంగా.. త‌మ‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింద‌ని కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో నేత‌ల‌కు, ఎమ్మెల్యేల‌కు స‌ర్ది చెప్పాల్సిన మంత్రులు.. వ‌లంటీర్ల విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస్తున్నారు. `మీరు(వైసీపీ నేత‌లు) చెబితే.. వ‌లంటీర్ల‌ను నియ‌మించాం. మీరు చూపించిన వారికే వ‌లంటీర్ పోస్టులు ఇచ్చాం.

ఈవిష‌యంలో ఎలాంటి తేడా లేదు. దీనిపై వివాదం ఎందుకు? `` అని సాక్షాత్తూ మంత్రులే ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌ల హోం మంత్రి తానేటి వ‌నిత వ్యాఖ్య‌లు చేస్తూ.. వ‌లంటీర్లు పార్టీ నాయ‌కుల పిల్ల‌లే. పార్టీ కుటుంబాల‌కు చెందిన‌వారే.. అన్నారు..

ఇక‌, ఇప్పుడు తాజాగా వాలంటీర్లే వైసీపీ సైనికులని  మంత్రి అంబటి రాంబాబు కుండబద్దలు కొట్టారు. మా నాయకులు సూచించిన వాళ్లనే వాలంటీర్లుగా ఎంపిక చేశామని నిర్మొహమాటంగా చెప్పేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న అంబటి.. వైసీపీని వ్యతిరేకించే వాలంటీర్లను తీసేసి కొత్త వాళ్లను పెట్టుకుంటామని స్పష్టం చేశారు.  'వాలంటీర్లంతా.. వైసీపీ కార్యకర్తలు, పార్టీకి సమాచారం చేరవేసే సైనికులు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరులో జరిగిన వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడారు. 'వాలంటీర్లు ఎవ రు?, వాళ్లను ఎవరు పెట్టారు అంటే.. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పెట్టారు. వీరిపై వ్య‌తిరేక‌త ఎందుకు?  వాలంటీర్లందరూ కూడా మనం చెప్పినవాళ్లే. వాలంటీర్స్ వైసీపీ కార్యకర్తలు. పార్టీకి వ్యతిరేకంగా వాలంటీర్లు మాట్లాడితే తీసేస్తాం.. అని ఆయ‌న హెచ్చ‌రించారు.

క‌ట్ చేస్తే.. ఇప్ప‌టి వ‌రకు వలంటీర్ పోస్టుల ద్వారా.. రాష్ట్రంలో 4 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించామ‌ని.. సీఎం జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉపాధిక‌ల్పించిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని అంటు న్నారు. కానీ.. తాజాగా వలంటీర్ వ్య‌వ‌స్థ వెనుక ఉన్న`వ్యూహాన్ని` మంత్రులు బ‌య‌ట పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి వ‌లంటీర్లు వైసీపీ కార్య‌క‌ర్త‌లేన‌ని స్ప‌ష్టం  అయిపోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News