కరోనా వేళ ప్రజలను కాపాడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే. వైరస్ సోకితే తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసినా వారు రోగులకు సేవలందించి తమ సేవానిరతను చాటుకున్నారు.
ఇక కరోనా వైరస్ సోకిన రోగులను ఇంటి నుంచి ఆస్పత్రికి.. తిరిగి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవర్లు అవిశ్రాంతంగా శ్రమించారు. కరోనా వేళ తమ సొంత కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ వారందరూ నిరంతరం పనులు చేస్తున్నారు. రోగులను ఒక చోట నుంచి మరొక చోటుకు తరలిస్తున్నారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను అంత్యక్రియలకు తరలిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన అంబులెన్స్ డ్రైవర్ ఆరిఫ్ ఖాన్ గత ఆరు నెలలుగా కరోనా రోగులకు సేవలందిస్తూ ఇంటి మొహం చూడకుండా దూరంగా ఉంటూ ఎంతో సేవలందించారు. 200వరకు మృతదేహాలకు సాయం అందించారు. నిరుపేదలకు సాయం చేస్తూ వచ్చారు.
కరోనా రోగులను తరలించడంలో నిరంతరం పనిచేసిన ఆరిఫ్ ఖాన్ చివరకు అదే కరోనాకు బలయ్యాడు. ఆరీఫ్ ఖాన్ ఆగస్టు 3న కరోనా బారిన పడ్డారు. సేవలందిస్తున్న ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించడం విషాదం నింపింది.
విషాదం ఏంటంటే తాను కరోనా మృతదేహాలను తరలించే అంబులెన్స్ లోనే ఆరిఫ్ ఖాన్ మృతదేహం తరలించడం విషాదం నింపింది. తోటి అంబులెన్స్ డ్రైవర్లంతా అతడికి ఘన నివాళులర్పించారు.