గురువింద నీతి;మన తప్పుల్నే ఎత్తి చూపించారు

Update: 2015-12-31 05:00 GMT
అచ్చు గురువింద నీతినే ప్రదర్శించిం అగ్రరాజ్యం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్ని తిప్పి పంపటం ఒకఎత్తు అయితే.. ఇందులో భాగంగా జైలుకు పంపి.. డ్రగ్స్ నేరస్తుల మధ్య ఉంచిన వైనం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ సర్కారు తీవ్రంగా స్పందించటం.. దీనిపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుతో.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో.. స్పందించిన ఆమె.. అమెరికాను ఈ ఉదంతంపై ప్రశ్నించారు.

భారత్ అడిగిన ప్రశ్నలకు అమెరికా అధికారులు తాజాగా సమాధానం ఇచ్చారు. విద్యార్థుల్ని వెనక్కి పంపే విషయంలో నిబంధనల్ని పాటించామని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరిగా సమాధానాలు చెప్పకపోవటంతో వారిని తిప్పి పంపినట్లుగా పేర్కొన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో.. భారత విద్యార్థుల్ని వెనక్కి పంపినట్లుగా అమెరికా బదులిచ్చింది.

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చే విద్యార్థులకు సంబంధించి.. బ్లాక్ లిస్ట్ లో ఉన్న యూనివర్సిటీ అడ్మిషన్లు పొందటమే కాదు.. ఇమ్మిగ్రేషన్ ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయిన చాలామందిని వెనక్కి పంపినట్లుగా అగ్రరాజ్యం పేర్కొంది. ఇన్ని మాటలు చెప్పిన అమెరికా.. సరైన సమాధానాలు చెప్పని విద్యార్థుల్ని.. జైల్లో ఉంచటం.. వారికి పంది మాంసం ఇవ్వటం.. అక్రమ డ్రగ్స్ దందాలో దొరికిన నేరస్తులతో కలిపి ఉంచటం లాంటివి ఎందుకు చేశారో మాత్రం వివరణ ఇవ్వకపోవటం గమనార్హం. తన తప్పుల్ని దాచి.. ఎదుటోడి తప్పుల్ని మాత్రమే చూపించటం గమనార్హం.
Tags:    

Similar News