దాయాది దుర్మార్గాల చిట్టా విప్పిన పెద్ద‌న్న‌

Update: 2017-05-12 09:04 GMT
గ‌డిచిన కొద్ది రోజులుగా భార‌త్‌.. పాక్ మ‌ధ్య సంబంధాలు అంత‌కంత‌కూ క్షీణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్దాలుగా రెండు దేశాల మ‌ధ్య పంచాయితీలు ఉన్న‌ప్ప‌టికీ.. గ‌తంలో ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు ఉన్న‌ట్లుగా తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. ఇదే విష‌యాన్ని పెద్ద‌న్న అమెరికా చెప్ప‌క‌నే చెప్పేసింది. అంతే కాదు.. ఇలాంటి ప‌రిస్థితి కార‌ణం ఎవ‌ర‌న్న విష‌యాన్ని చాలా స్ప‌ష్టంగా చెప్పేయ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో రెండు దేశాల విష‌యాల‌పై ఆచితూచి మాట్లాడే అమెరికా.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా  ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పేసింద‌ది. ఇప్పుడున్న‌ట్లుగా ప‌రిస్థితులు కొన‌సాగితే.. ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత దిగ‌జార‌తాయ‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. దీనంత‌టికి కార‌ణం పాకిస్థానే అంటూ అమెరికా పేర్కొంది.

భార‌త్ లో సాగుతున్న ఉగ్ర‌వాద వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాక్ మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌టంతో పాటు.. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో ప‌ఠాన్ కోట్ లో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో పాక్ విచార‌ణ చేయ‌క‌పోవ‌టం లాంటి కార‌ణాలు ఇరుదేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని చాలావ‌ర‌కు దెబ్బ తీశాయ‌న్న మాట‌ను అగ్రరాజ్యం చెప్పింది.

గ‌త ఏడాది భార‌త్‌ లో జ‌రిగిన రెండు ప్ర‌ధాన ఉగ్ర‌దాడులు కూడా ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు క్షీణించేందుకు కార‌ణంగా చెప్పిన అమెరికా.. మ‌రోసారి కానీ భార‌త్ లో భీక‌ర ఉగ్ర‌దాడి జ‌రిగినే మాత్రం ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుంద‌ని అమెరికా వెల్ల‌డించింది. ప‌ఠాన్ కోట్ ఎపిసోడ్ లో ఉగ్ర‌దాడిలో త‌మ సైనికులు అమ‌రులైన విష‌యాన్ని పాక్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని.. ఈ ఉదంతంలో పాక్ కు చెందిన ఉగ్ర‌వాదుల హ‌స్తం ఉంద‌ని భార‌త్ ప‌లుమార్లు చెప్పినా దాయాది పట్టించుకోలేద‌న్న మాట‌ను అమెరికా వెల్ల‌డించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News