ప్రాణాంతక వైరస్ నుంచి కాపాడేవి కొన్ని వ్యాక్సిన్లు అని గతంలోనే తేలింది. ఆ వ్యాక్సిన్లపై ఇప్పటికే పరిశోధనలు జరిగాయి. వైరస్ నివారణకు, కట్టడి కోసం క్షయ, పోలియో వ్యాక్సిన్లు దోహదం చేస్తాయని చాలా పరిశోధనల్లో తేలింది. వీటిని వైరస్ నివారణకు వినియోగించే విషయంలో అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేయడంతో ట్యుబర్‌కులోసిస్ టీకా పనిచేస్తున్నదో లేదో తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయి. వైరస్‌పై పోరాడేందుకు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఏకైక టీకా బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్టే గ్యురిన్)నే అని టెక్సాస్ ఏ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో చెబుతున్నారు.
అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతంలో ఈ టీకాను సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ను నిలువరించేందుకు పోలియో వ్యాక్సిన్‌ను కూడా వాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై స్పందిస్తూ పాక్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ అజ్రా రజా మాట్లాడారు. బీసీజీ టీకా అనేక రకాల వైరస్‌లతోపాటు బ్లాడర్ క్యాన్సర్‌ను కూడా అడ్డుకున్నట్లు రుజువైందని వివరించారు. బీసీజీ, పోలియోలపై పోరాడేందుకు గతంలో కోట్ల మందికి ఈ టీకాలను ఇచ్చామని గుర్తుచేశారు. వీటితో బాధితులకు రిస్క్ చాలా తక్కువని, ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత వైరస్‌తో పాటు పలు రకాల వైరస్‌లను నియంత్రించే శక్తి వీటికి ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం మహమ్మారి వైరస్ నివారణలో ఆ వ్యాక్సిన్ల వినియోగంపై పరిశోధనలు అమెరికాలో విస్తృతంగా చేస్తున్నారు. వాటి ద్వారా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.