నాటి సంఘటనను గుర్తు చేస్తూ.. మోదీని పరోక్షంగా టార్గెట్ చేసి అమెరికా..!

Update: 2022-11-25 11:30 GMT
అమెరికా-భారత్ మధ్య కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆర్థిక.. వాణిజ్య పరమైన అంశాలతో పాటుగా ఇరుదేశాల మధ్య మైత్రీ బంధం కొనసాగుతోంది. అయితే అమెరికా మాత్రం ఎల్లప్పుడు తన కుటీల నీతిని ప్రదర్శిస్తూనే ఉంది. భారత్ ను అనవసర విషయాల్లోకి అమెరికా లాగేందుకు ప్రయత్నించినా భారత్ నిర్మోహమాటంగా వాటిని తిప్పికొట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి.

తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అమెరికా పరోక్షంగా టార్గెట్ చేసింది. 2014కు ముందు జరిగిన ఒక ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇచ్చామని తాజాగా కామెంట్ చేయడం వివాదానికి కారణమవుతోంది. అమెరికా వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వివాదాస్పద జర్నలిస్ట్ జమాల్‌ ఖషోగ్గి దారుణ హత్య కేసులో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌ దోషిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో అమెరికా ప్రభుత్వం ప్రాసిక్యూషన్ నుంచి మహ్మద్ బిన్ సల్మాన్‌ రక్షణ కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

అయితే తాజాగా వైట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖషోగ్గి హత్య కేసులో మహ్మద్ బిన్ సల్మాన్ కు మినహాయింపు ఇవ్వడాన్ని గతంలో ప్రధాని మోదీ ఉదాంతంతో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదంత్ పటేల్ పోల్చారు. అమెరికా పలువురు దేశాధినేతలకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇవ్వడం కొత్తమీ కాదని వివరించారు.

1993లో హైతీ అధ్యక్షుడు అరిస్టైడ్.. 2001లో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే..  2014లో నరేంద్ర మోదీ.. 2018లో డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగో అధ్యక్షుడు కబీలాకు అమెరికా తమ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ జాబితాలో పలువురు విదేశాంగ మంత్రులు సైతం ఉన్నారని వేదంత్ పటేల్ గుర్తు చేశారు.

అయిత భారత ప్రధానిపై వేదంత్ పటేట్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మీడియాలో చర్చకు దారితీశారు. ఖషోగ్గి హత్యకేసుతో ముడిపెట్టి అమెరికా భారత ప్రధానిపై వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ తాజాగా ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందర్ బాగ్చీ అన్నారు.

ప్రస్తుతం అమెరికా.. భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. అమెరికా మోదీపై చేసిన సందోర్భచితమా? కాదా? అనేది తనకు తెలియడం లేదన్నారు. ఏదిఏమైనా అమెరికా మోదీపై చేసిన వ్యాఖ్యలు సరైన కావని అరిందర్ బాగ్చీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు మరింతగా బలపడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రధాని మోదీని పరోక్షంగా టార్గెట్ చేయడం వెనుక ఏదైనా మతలబు ఉందా? అన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News