ఏదైనా మనసులో అనుకుంటే చాలు ..ఇట్టే జరుగుతుంది ..ఎలా అంటే ?

Update: 2019-11-12 01:30 GMT
ప్రస్తుత ప్రపంచంలో ఏదైనా సాధ్యమే .. అందనంత ఎత్తులో ఉండే ఆకాశానికి కూడా రాకెట్స్ తో పోయి వస్తున్నారు.ఈ అత్యాధునిక యుగంలో కంప్యూటర్ బుర్రతో దేనికైనా క్షణాల వ్యవధిలో సమాధానం కనుగొంటున్నారు. అలాగే కాలం తో పాటిగా మనిషి కూడా పేరుగెత్తుతూ ముందుకు అడుగులు వేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడున్న టెక్కాలజీ రంగంలో  మనిషి ఆలోచనలు కూడా సూపర్‌ఫాస్ట్‌ అయిపోయాయి. అయితే మన ఆలోచనలు ఆచరణ రూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది.  సాధారణంగా మనం లైట్ స్విచ్ ఆఫ్ చేయాలి అంటే  ఉన్నచోటు నుండి స్విచ్ దగ్గరికి వెళ్లి ఆఫ్ చేయాలి. కానీ ఇవేవీ లేకుండా మీరు మనసులో ఓ మాట అనుకోవడమే ఆలస్యం ఆ లైట్ ఆరిపోతే ...అంతకంటే ఇంకేం కావాలి అంటారా. కానీ , ఇది సాధ్యమేనా అని అనుకుంటున్నారా ..మనిషి తలచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు. కానీ , ఇది కార్యరూపం దాల్చడానికి కొద్దిగా సమయం పట్టచ్చు ..కానీ , అసాధ్యం మాత్రం కాదు.

ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం పెంటగన్ ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని ఏడాది క్రితమే స్టార్ట్ చేసారు. నెక్స్‌ జనరేషన్‌ నాన్‌ సర్జికల్‌ న్యూరో టెక్నాలజీ ప్రోగ్రాం’పేరుతో ఈ సరికొత్త ప్రాజెక్టుకు ఏడాది క్రితమే శ్రీకారం చుట్టింది. కేవలం ఆలోచనలతో డ్రోన్స్ నడిపించడానికి ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. డ్రోన్స్ ,  డ్రోన్ల గుంపు లని ఆలోచనలతోనే నియంత్రిచడం , దీనిద్వారా యంత్రాలతో పనిచేసే అవసరాన్ని తప్పించుకోవడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మన మెదడుని కంప్యూటర్ కి అనుసంధానం చేసే బీసీఐ లాంటి పరికరాన్ని తయారుచేస్తారు.

ఈ పరికరాన్ని తలకి తగిలించుకున్న సైనికులు ఎక్కడో దూరంగా వెళ్తున్న డ్రోన్లు ఏ దిశగా వెళ్ళాలి .. ఎంత ఎత్తులో వెళ్ళాలి ..ఎంత స్పీడ్ తో వెళ్ళాలి అనే విషయాలని కంట్రోల్ చేస్తుంటాడు. డార్ఫ కి చెందిన నాడి శాస్త్రవేత్త అల్ ఏమండీ నేతృత్వంలో ఈ సరికొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. పెంటగన్ ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా ఆరువందల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది. కార్నెగియే మెలోన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విద్యుత్ , అల్ట్రా సౌండ్ సంకేతాలతో బీసీఐ ని తయారు చేయాలనీ ప్రయత్నిస్తుండగా .. పరారణ కిరణాల సాయంతో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనాలు చేస్తుంది. మన మెదడులోని ఆలోచనలో సూక్ష్మ తరంగాల రూపంలో ఉంటాయని అందరికి తెలిసిందే. ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఈ పరికరాలకి మనిషి మెదడు లో అమర్చాలని చూస్తుంది. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు కానీ , శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా తప్పుడు ఆలోచనలు చేస్తే ఎలా ..శత్రు సైనికులకు ఈ బీసీఐ లు దొరికితే ఏంచేయాలి ..మరోవైపు ఈ బీసీఐ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. బీసీఐ కనుక అందుబాటులోకి వస్తే ..స్మార్ట్ ఫోన్స్ నుండి ఇంటర్ నెట్ తో అనుసంధానం అయ్యే ప్రతి వస్తువుని కూడా మనం ఆలోచనలతోనే నియంత్రించవచ్చు. ఇవన్నీ కూడా సాకారం కావడానికి కొంత సమయం అయితే పడుతుంది కానీ , అసాధ్యం అయితే కాదు.
Tags:    

Similar News