పాక్ కు నోట మాట రాలేని రీతిలో షాకిచ్చిన పెద్ద‌న్న‌

Update: 2019-03-06 11:54 GMT
గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. కొన్ని విష‌యాల్లో వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ.. అంత‌ర్జాతీయంగా ఆయ‌న తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు ఓకే అన్న రీతిలో ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అమెరికా అధ్యక్షులుగా ఎవ‌రున్నా స‌రే.. భార‌త్ తో పోలిస్తే.. పాక్ విష‌యంలో కాసింత సానుకూల‌తతో వ్య‌వ‌హ‌రించటం.. పైకి భార‌త్ తో స్నేహం న‌టిస్తూనే.. దాయాదికి ఇచ్చే ఆర్థిక సాయం విష‌యంలో ఎలాంటి కోత విధించ‌క‌పోవ‌టం లాంటివి చేసేవారు.

అయితే.. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సీన్ మారింది. పాక్ కు పెద్ద ఎత్తున పంపే నిధుల‌కు బ్రేకులు వేసిన ఆయ‌న‌.. గ‌త అధ్య‌క్షుల కంటే కాసింత క‌ఠినంగానే ఉన్నార‌ని చెప్పాలి. ఇటీవ‌ల భార‌త్ - పాక్ ల మ‌ధ్య జ‌రిగిన ఉద్రిక్త‌త‌ల ఎపిసోడ్ లో దాయాదితో పోలిస్తే.. మ‌న‌ప‌ట్లే కాసింత సానుకూల‌త‌తో వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెప్పాలి. ఒక ద‌శ‌లో ఘ‌ర్ష‌ణ‌ను త‌గ్గేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న మాట‌ను కాస్త క‌టువుగానే అమెరికా నోటి నుంచి వ‌చ్చింది.  ఉగ్ర‌వాదం విష‌యంలో ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌లు దేశాల నుంచి మొట్టికాయ‌లు వేయించుకున్న పాకిస్థాన్.. తాజాగా పెద్ద‌న్న చేత దిమ్మ తిరిగే షాక్ ఒక‌టి పాక్కు త‌గిలింది.

పాకిస్థానీయుల‌కు తాజాగా వీసా షాక్ ఇచ్చింది అమెరికా. మిగిలిన దేశాల‌కు భిన్నంగా పాక్ పౌరుల‌కు సంబంధించి వివిధ కేట‌గిరీల వీసాల కాల‌ప‌రిమితిని త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని పాక్ లోని ఆ దేశ రాయ‌బార కార్యాల‌య అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. వ‌ర్క్.. మిష‌న‌రీస్ కు చెందిన వీసాల గ‌డువును భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌ర్క్.. మిష‌న‌రీస్ కు సంబంధించిన వీసాల గ‌డువును ఐదేళ్ల నుంచి 3 నెల‌ల‌కు త‌గ్గించింది.

అంతేకాదు.. పాక్ పౌరులు ఎవ‌రైనా స‌రే అమెరికాకు వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే ఇప్పుడున్న 160 డాల‌ర్ల స్థానే 192 డాల‌ర్లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అంతేకాదు.. బిజినెస్.. టూరిజం.. స్టూడెంట్ వీసాల కాల‌ప‌రిమితిని ఐదేళ్ల‌తో చెల్లుబాటు అయ్యేలా ఉండేది. తాజాగా స‌వ‌రించిన దాని ప్ర‌కారం ఆవిభాగంలో మార్పులు చేయ‌లేదు. కాకుంటే.. పాక్ పౌరుల‌కు సంబంధించి వివిధ కేట‌గిరిల వారికి త‌గ్గించిన స‌మ‌యం దాయాది ప్ర‌జ‌ల గొంతుల‌కు అడ్డుప‌డ‌ట‌మే కాదు.. భారీ షాక్ గా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  

    

Tags:    

Similar News