అమెరికా తప్పుల మీద తప్పులు చేస్తోందా ? అగ్రరాజ్యం తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనాలను వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసి ఆఫ్ఘనిస్ధాన్ను తాలిబన్లకు వదిలేసిన అమెరికా ఇపుడు ఆల్ ఖైదా వేటలో పాకిస్ధాన్ సాయం కోరింది. ఆప్ఘనిస్ధాన్ విషయంలోనే తప్పులు చేసిందని యావత్ ప్రపంచదేశాలు అమెరికాను ఎంతగా దుమ్మెత్తిపోస్తున్నాయో అందరు చూస్తున్నదే. తన చర్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంతగా సమర్ధించుకుంటున్నా మిగిలిన దేశాల ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పుకోలేక నానా అవస్తలు పడుతున్నాడు.
ఇలాంటి సమయంలోనే ఇప్పుడు చేసింది చాలదన్నట్లుగా ఆల్ ఖైదా నేతలను వేటాడటంలో పాకిస్ధాన్ సాయం కోరినట్లు అమెరికా మీడియాను అనేక విషయాలను బయటపెట్టింది. ఆల్ ఖైదా నేతలను పట్టుకునే విషయంలో సాయం చేయాలంటు అమెరికా రక్షణరంగ నిపుణులు పాకిస్ధాన్ పాలకులకు పంపిన ఈ మైళ్ళు ఇపుడు బయటపడ్డాయి. తాజాగా బయటపడిన అంశాలతో అసలు అమెరికా బుర్ర సక్రమంగా పనిచేస్తోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఆల్ ఖైదా నేతలను అమెరికా పట్టుకోవటం ఏమిటి అందుకు పాకిస్ధాన్ సాయాన్ని అర్ధించటం ఏమిటి ? అని ప్రపంచదేశాలు నివ్వెరపోతున్నాయి.
ఆల్ ఖైదా టాప్ లీడర్ ఒసామా బిన్ లాడన్ దెబ్బకు అమెరికాలోని న్యూయార్కులో ఉన్న జంట టవర్లు ఏ స్ధాయిలో దెబ్బతిన్నాయో అందరికీ తెలిసిందే. విమానాన్ని హైజాక్ చేసి జంట టవర్లను కూల్చేసిన ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద సంచలనం. అప్పటి నుండి తమను చావుదెబ్బ తీసిన ఆల్ ఖైదా అగ్రనేతలను మట్టుపెట్టడానికి అమెరికా ఎంత అవస్తలు పడిందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే పాకిస్ధాన్ సాయం కూడా కోరింది. ఒకవైపు అమెరికాకు సాయం చేస్తానని మాటిచ్చిన పాకిస్ధాన్ మరోవైపు ఒసామా బిన్ లాడెన్ను తన దేశంలో ఆశ్రయం కల్పించింది.
ఎవరికీ తెలీకుండా, మరోకంటికి కనబడకుండా లాడెన్ తో పాటు ఎంతోమంది ఆల్ ఖైదా అగ్రనేతలకు పాకిస్ధాన్ షెల్టర్ ఇచ్చింది. ఈ సంగతి తెలుసుకునేందుకే అమెరికాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. అందుకనే లాడెన్ను మట్టుబెట్టే విషయంలో కనీసం పాకిస్ధాన్ కు కూడా తెలీకుండానే అమెరికా అర్ధరాత్రి తన పని కానిచ్చేసింది. ఇంత తతంగం నడిపించిన పాకిస్ధాన్ను మళ్ళీ ఇపుడు అదే అమెరికా నమ్మడం, సాయం అడగటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇపుడు ఆల్ ఖైదా నేతలను వేటాడేందుకు పాకిస్ధాన్ సాయం ఎందుకంటే చాలామంది ఆప్ఘన్-పాక్ సరిహద్దుల్లో దాక్కున్నారని సమాచారం అందిట. ఇపుడు ఆప్ఘన్+పాక్ మిత్రదేశాలు కాబట్టి ఎక్కడెక్కడి ఆల్ ఖైదా నేతలంతా రెండు దేశాల సరిహద్దుల్లోనో లేకపోతే పాకిస్ధాన్లో హాయిగా రిలాక్స్ అవుతున్నారని అనుమానం వచ్చిందట. అందుకనే బాబ్బాబు అంటు మళ్ళీ అమెరికా ఇపుడు పాకిస్దాన్ సాయం కోరుతోంది. మరి పాకిస్ధాన్ ఏమి చేస్తుదో చూడాల్సిందే.