జ‌పాన్‌ కు భూమి ఇస్తున్న అమెరికా!

Update: 2016-12-22 09:47 GMT
ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికా మ‌రో బ‌లమైన ఆర్థిక శ‌క్తి జ‌పాన్‌ కు భూమి ఇస్తోంది. జ‌పాన్‌ లోని ఒకిన‌వా దీవుల్లోని కొంత భాగాన్ని ఆ దేశానికి అమెరికా అప్ప‌గించ‌నుంది. అయితే ఇది అమెరికా అక్ర‌మిత భూమి కావ‌డం ఆస‌క్తిక‌రం. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో ఒకిన‌వా దీవుల‌ను అమెరికా ఆక్ర‌మించుకుంది. జ‌పాన్‌ లో ఉన్న అమెరికా వైమానిక స్థావ‌రాల‌కు ఇదే కేంద్ర‌బిందువు. అయితే ఇటీవ‌ల జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే - అమెరికా రాయ‌బారి క‌రోలిన్ కెన్న‌డీ ఈ అంశంపై టోక్య‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని మేర‌కు భూ బదిలీ జ‌రుగుతోంది.

భూ బ‌దిలీ ఒప్పందం ప్ర‌కారం ఒకిన‌వా దీవిలోని సుమారు నాలుగు వేల హెక్టార్ల భూమిని జ‌పాన్‌ కు అమెరికా అంద‌జేయ‌నుంది. అయితే భూ బ‌దిలీ ఒప్పందంలో భాగంగా అగ్ర‌రాజ్యం అమెరికాకు ఆరు హెలిప్యాడ్ల‌ను నిర్మించి ఇస్తోంది జ‌పాన్. ఒకిన‌వాలో చాలా వ‌ర‌కు భూభాగం అమెరికా ఆధీనంలో ఉంది. ప్ర‌స్తుత బ‌దిలీ ద్వారా కేవ‌లం 20 శాతం భూభాగం మాత్ర‌మే జ‌పాన్‌ కు అందుతుంది. అయితే అమెరికా చేప‌ట్టిన ల్యాండ్ ట్రాన్స‌ఫ‌ర్ ప్ర‌క్రియ‌ను స్థానికులు వ్య‌తిరేకిస్తున్నారు. ఒకినావ్‌ లో కొన‌సాగుతున్న అమెరికా వైమానిక కార్య‌క‌లాపాల‌ను స్థానికులు నిర‌స‌న తెలుపుతున్నారు. త‌మ ప్రాంతాన్ని పూర్తిగా వ‌దిలి వెళ్లాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ముంద‌స్తుగా అమెరికా ఈ మేర‌కు 20 శాతం ఇస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News