అమెరికాలో నల్ల జాతీయుడిని ఓ పోలీస్ అధికారి కాళ్ల కిందవేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన సంగతి విదితమే. దీనిపై అమెరికాతో పాటుగా ఇతర దేశాలలో కూడా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొంతమంది స్టార్ స్టేటస్ ఉన్న నల్లజాతీయులు తనకి జరిగిన అవమానాల గురించి చెప్తూ ,జార్జ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ జాతి వివక్షపై అమెరికా టెన్నిస్ ప్లేయర్ టేలర్ గళమెత్తింది.
జాతి వివక్షకు వ్యతిరేకంగా టెన్నిస్ ప్రపంచం ఐక్యం కాలేదని అమెరికా టెన్నిస్ యువ క్రీడాకారిణి టేలర్ టౌన్‌సెండ్ ఆరోపించింది. టోర్నీల సమయంలో మిగతా క్రీడాకారిణులను ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. తనను మాత్రం పదేపదే తనిఖీలు చేస్తారని వాపోయింది. టెన్నిస్ లో నల్ల జాతీయులు వీనస్, సెరెనా విలియమ్స్, లేదా స్లోన్ స్టీఫెన్స్‌లాంటి ఇద్దరుముగ్గురే ఉన్నారని అనుకుంటారని టేలర్ యూ ట్యూబ్ లో పోస్టు చేసిన టెన్నిస్ యునైటెడ్ వీడియో లో టేలర్ చెప్పింది. జార్జ్ ఫ్లాయిడ్ కు సంఘీభావంగా ఈ వీడియో విడుదల చేశారు.
టోర్నీల సందర్భంగా సెక్యూరిటీ వాళ్లు తనను చాలా అనుమానంగా చూస్తారని టేలర్ చెప్పుకొచ్చింది. ‘నా బ్యాగ్, ధ్రువపత్రాలు పదేపదే తనిఖీ చేస్తారు. నా కోచ్‌కు సంబంధించిన వివరాలను కూడా ఒకటికి రెండుసార్లు సరిపోల్చుకుంటారు. మిగతా ప్లేయర్ల విషయానికొస్తే.. వాళ్లను ఇవేవీ అడగరు’ అని ప్రపంచ 73వ ర్యాంకరైన టేలర్ వాపోయింది. ఇలా ఎన్నోసార్లు జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.