ప్రపంచంలోనే అగ్రదేశం.. అతిపెద్ద ఇంటిలిజెన్స్ వ్యవస్థ కలిగిన దేశం. ప్రపంచంలోనే ఏం జరిగినా.. ఏం కనిపెట్టినా మేమే కనిపెడతాం.. అవన్నీ మావే అని చెప్పుకునే దేశం అమెరికా. అందుకే అన్ని విషయాలపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసే స్థాయిలో అమెరికా ఉంది. అంతర్జాతీయ అంశాలతో పాటు వైజ్ఞానిక - శాస్త్రసాంకేతిక విషయాలపై అమెరికా ఇతర దేశాలకు మార్గదర్శకత్వం చేస్తుంది. అలాంటి అమెరికా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎందుకు అప్రమత్తం చేయలేదని చర్చ సాగుతోంది. ఇంతటి ప్రమాదకర వైరస్ ను అమెరికా ముందే గుర్తించలేదా? దాని పర్యవసానం గుర్తించడంలో అమెరికా నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? అనే సందేహాలు వస్తున్నాయి. చైనాలోని వ్యూహన్‌లో పుట్టిన కరోనా వైరస్ ను గుర్తించకపోవడంపై అమెరికా నిఘా వ్యవస్థ వైఫల్యం పొందిందని ప్రపంచ దేశాలు విమర్శలు చేస్తున్నాయి.
మొదట చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ను అమెరికా ఇంటిలెజెన్స్ గుర్తించలేకపోయింది. డిసెంబర్ లో చైనాలోని వ్యూహన్ లో కరోనా విజృంభించగా అమెరికా నిఘా వ్యవస్థ అప్రమత్తం కాలేదు. జనవరిలో ప్రపంచ దేశాలకు పాకింది. అప్పుడు ఆ వ్యవస్థ పని చేయలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా తాండవిస్తోంది. ముఖ్యంగా సొంత దేశం అమెరికాలో అత్యధికంగా కరోనా వైరస్ ఉంది. తీవ్రంగా ఆ వైరస్ వ్యాపిస్తోంది.. ప్రధానంగా సతమతమవుతున్న దేశాల్లో అమెరికా ఒకటి. ఇప్పుడు చైనా చివరకు చిన్న దేశం జపాన్ వరకు వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఈ క్రమంలో ప్రపంచం విపత్కర పరిస్థితిలో కూరుకుపోయింది. అయితే దీన్ని ముందే గుర్తించి తమ దేశంతో పాటు ఇతర దేశాలకు సమాచారం అందించాల్సిన అమెరికా నిఘా వ్యవస్థ ఈ విషయంలో ఘోరంగా విఫలమైందని వివిధ సంస్థల ప్రతినిధులు - అంతర్జాతీయ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఉగ్రవాదం - వాతావరణం - ఆహార కొరత తదితరతో పాటు ఎన్నో అంశాలపై అమెరికా నిఘా వ్యవస్థ ప్రపంచ దేశాలకు సూచనలు - హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. మరి కరోనా వైరస్ విషయంలో ఏమైందని అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ప్రపంచ దేశాలకు పోని తమ సొంత దేశం అమెరికానైనా అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా వందల్లో ఉంది. ఇంత విపత్తు తీసుకొచ్చిన కరోనా వైరస్ ను అమెరికా నిఘా వ్యవస్థ గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే అమెరికా ఇంటిలిజెన్స్ కరోనా వైరస్ ను గుర్తించి ప్రపంచ దేశాలకు ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరస్ పై అప్రమత్తం చేయలేదని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమున్నా ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి చైనా - ఇటలీ తర్వాత ప్రధానంగా సతమతమవుతున్న దేశం అమెరికానే. ఈ వైరస్ ను గుర్తించకపోవడంలో వందకు వంద శాతం అమెరికా ఇంటిలిజెన్స్ విఫలమైందని స్పష్టంగా చెబుతోంది. ఇంటిలిజెన్స్ హెచ్చరికలు చేసి ఉంటే ముందే జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించేది కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.