అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ జాన్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి గా నిలిచారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో.. అతివాద నిర్ణయాలతో.. అగ్రరాజ్య అహంకారంతో.. ముస్లిం వ్యతిరేక నినాదాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. సొంతపార్టీ - పక్కపర్టీ అనే బేదాలేమీ లేవు, ఎవరిపై పడితే వారిపై నోరు పారేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ పై ప్రముఖ దినపత్రికలు నేరుగా దాడిచేయడం మొదలుపెట్టాయి. మీడియా మొత్తం కూడబలుక్కున్నట్లుగా... ట్రంప్ ని ఏకిపారేస్తున్నాయి!
మన రాష్ట్రాలు - మన దేశం సంగతి కాసేపు పక్కనపెడితే... అమెరికాలో సాధారణంగా ఎన్నికల సమయంలో చాలా వరకూ పత్రికలు తటస్థ విధానాన్నే అనుసరిస్తుంటాయి! అయితే ఈ సంప్రదాయాన్ని కూడా పక్కనపెట్టిన ప్రముఖ దినపత్రిక "యూఎస్ ఏ టుడే" సైతం ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనికిరాడు అంటూ ఎడిటోరియల్ రాసేసింది. అమెరికాలోని ప్రముఖ దినపత్రికలు ట్రంప్ పై ఏ రేంజ్ లో వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఈ విషయంలో హిల్లరీకి నేరుగా మద్దతు పలుకుతూ... ట్రంప్ కు ఓటువేస్తే జరిగే పరిణామాలపై నేరుగా దాడిచేస్తున్నాయి.
ట్రంప్ గతంలో చేసిన తప్పిదాలను - మహిళలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను - పన్నులు ఎగ్గొట్టిన విషయాలను ఆదారాలతో సహా తవ్వి తీసి ట్రంప్ అసలు స్వరూపాన్ని అమెరికా ఓటర్ల ముందు ప్రదర్శిస్తున్నాయి అక్కడి పత్రికలు. ఈ విషయంలో "వాషింగ్టన్ పోస్ట్" పత్రిక అయితే "ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాడు" అంటూ హెచ్చరించగా... ట్రంప్ ప్రచారాన్ని జర్నలిస్టులు సైతం నేరుగా బహిష్కరిస్తున్నారు. అమెరికాలో ఉన్న పత్రికల్లో సుమారు 80 పత్రికలు హిల్లరీని బలపరుస్తున్నాయంటే... ట్రంప్ కు వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. చరిత్రలో ఏనాడూ డెమోక్రటిక్ పార్టీని బలపరచని పత్రికలు సైతం హిల్లరీకి మద్దతు పలుకుతున్నాయి. 1890 నుంచి ఏనాడూ డెమోక్రటిక్ పార్టీని బలపరచని "ద ఆరిజోనా రిపబ్లిక్".. 1944లో రూజ్‌వెల్ట్ తర్వాత ఎప్పుడూ డెమోక్రటిక్ అభ్యర్థికి వెన్నుదన్నుగా నిలవని "డల్లాస్ మార్నింగ్ న్యూస్" అనే పత్రికలు సైతం హిల్లరీ కి మద్దతు పలకడం ట్రంప్ పై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుందనే చెప్పాలి. ఇక సీ.ఎన్.ఎన్. అంటే "క్లింటన్ న్యూస్ నెట్ వర్క్" అని ట్రంప్ విమర్శిస్తున్నాడంటే ఆ మీడియా ట్రంప్ కు వ్యతిరేకంగా వార్తలను ఏ రేంజ్ లో ప్రసారం చేసి ఉంటుందో వూహించుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/