అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టి వారం రోజులు గడిచిపోయింది. ఎన్నికల ప్రచారం మొదలు, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సమయంలోనూ పలు సంచలనాలకు తెర తీసిన ట్రంప్... ఆ తర్వాత కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఏవరేమనుకున్నా... తాననుకున్నది చేసి తీరాల్సిందేనన్న యావతోనే ట్రంప్ ముందుకు సాగుతున్నారు. ఈ వారం రోజుల వ్యవధిలో ఆయన తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తేనే... ఈ విషయం అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే... ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే... అమెరికాలో నిరసనలు పెల్లుబికాయి. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చిన జనం... ట్రంప్ కు వ్యతిరేకంగా గళం విప్పారు.
అయితే ఈ నిరసనలను ఏమాత్రం లెక్కచేయని ట్రంప్... తనకో తిక్కుందని - ఆ తిక్కకు ఓ లెక్కుందన్న చందంగా... ఆందోళనలు చేస్తే... కఠిన కారాగార శిక్షలే ఉంటాయని హెచ్చరికలు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా... మరి వారం పాటు ట్రంప్ సాగించిన పాలన ఎలా ఉందన్న విషయానికొస్తే... సగానికిపైగా ఆయనను సమర్థుడిగానే ఒప్పుకున్నారు. అదే సమయంలో ట్రంప్ పై అమెరికన్లలో మెజారిటీ ప్రజలు ఓ ఘాటు విమర్శను కూడా గుప్పించారు. సమర్థుడిగానే కాకుండా తెలివి కలిగిన(ఇంటెలిజెంట్) వాడిగానే ట్రంప్‌ను పరిగణించిన అమెరికన్లు... ఆయనను కామన్ సెన్స్ లేని వాడిగా తేల్చేశారు.
ట్రంప్ వారం పాలనపై అమెరికాకు చెందిన పరిపాలన తీరుపై ప్రఖ్యాత క్విన్నిపియాక్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్ సర్వే ఫలితాలు నేటి ఉదయం విడుదలయ్యాయి. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 68 శాతం మంది ట్రంప్ సమర్థుడని, 65 శాతం మంది ఆయనను ఇంటెలిజెంట్ అని అన్నారు. అదేసమయంలో 62 శాతంమంది ట్రంప్ అవివేకిఅని తేల్చిపారేశారు. మొత్తంగా వందలో 36 శాతం మంది ‘ట్రంప్ ఐదు రోజుల పరిపాలనకు మద్దతు పలకగా, 44 శాతం మంది వ్యతిరేకించారు. ‘కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేశారు తప్ప,ఆ విధానాలను అమలు చేసే దిశగా ఆయన సర్కారు నడుం కట్టడంలేదు’ అని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు.
జాతి వివక్ష - లింగ వివక్ష సంబంధింత అంశాలపై ఆయన దృష్టిపెట్టనేలేదని విమర్శించారు. రిపబ్లికన్లలో 81 శాతం మంది ట్రంప్ పరిపాలనా విధానాన్ని సమర్థించగా, 3 శాతం మంది పెదవి విరిచారు. అదే డెమోక్రాట్లలో కేవలం 4 శాతం మందే ట్రంప్ రూలింగ్ బాగుందని మెచ్చుకోగా, 77 శాతం మంది చెత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక మహిళల్లో 50 శాతంమంది ట్రంప్ ఐదురోజుల పాలలను తిరస్కరించగా, 33 శాతం మంది అంగీకరించారు. శ్వేతజాతీయుల్లో 43 శాతం మందే ట్రంప్ కు మద్దతుపలకగా - నల్లజాతీయుల్లో 43 శాతం మంది వ్యతిరేకత వెలిబుచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/