సర్వం బ్రహ్మమయం అని వేదాంతం చెబుతుంది. కానీ వర్తమాన రాజకీయాలను గమనించినప్పుడు కేంద్ర రాజకీయాలకు సంబంధించి.. సర్వం ‘పకోడా మయం’ అనుకోవాల్సిందే. అవును మరి.. పకోడా ప్రస్తావన లేకుండా ఎవరి ప్రసంగాలు గానీ, ఎవరి ఉద్యమాలు గానీ, ఎవరి విందులు గానీ సాగడం లేదు అక్కడ. పాలకులేమో తాము ప్రామిస్ చేసిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ కల్పించేశాం అనడానికి పకోడా వ్యాపారులే ఉదాహరణ అని అంటారు. అవును- పకోడా ఆత్మగౌరవానికి చిహ్నం అని కూడా సెలవిస్తారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు పకోడా విమర్శలను పదేపదే రువ్వుతూనే.. తమ ప్రచార ప్రసంగాల పర్యటనల బ్రేకుల్లో మాత్రం.. పకోడాలను ఆరగించి సేదతీరుతున్నారు మరియు మళ్లీ పకోడా విమర్శలు చేయడానికి బలం పుంజుకుంటున్నారు.
ప్రధాని మంత్రి నరేంద్రమోడీ పకోడా అమ్ముకుని రోజుకు 200 సంపాదించుకోవడం కూడా ఉద్యోగావకాశాలను కల్పించినట్లే అనే వ్యాఖ్యను టీవీ ఛానెల్ లో అనడం ద్వారా ఒక పెను దుమారానికి తెర తీసారు. విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం అన్న హామీని ఏ గంగలో కలిపారు స్వామీ అని దేశంలోని యువతరం విలపిస్తూ ఉంటే.. పకోడా అమ్ముకుని 200 సంపాదించుకోవచ్చు కదా.. అది ఉపాధి లేదా ఉద్యోగం లేదా తత్సమానమైనది కాకుండా పోతుందా అనే అర్థం వచ్చేలా మోడీ మాట్లాడడం సహజంగానే విద్యావంతులైన యువతరానికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఈ మాట విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ బ్రిగేడ్ ప్రయత్నించింది కానీ వారి వల్ల కాలేదు. సరైన కోణంలోంచి వ్యవహారాన్ని హైలైట్ చేయలేకపోయారు. అదే సమయంలో.. దేశంలోని యువతరం మాత్రం తమ ఆగ్రహాన్ని చక్కగానే తెలియజెప్పింది. బస్టాండ్లలో - రోడ్ల కూడళ్లలో ఎక్కడపడితే అక్కడ మోడీ పకోడా - అమిత్ పకోడా అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీకి ఈ పకోడా సెగ కూడా తగిలింది.
ఇదంతా ఒక ఎత్తు కాగా, తాజాగా కర్నాటక లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ సింధనూరు తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటించారు. మోడీ మీద సహజంగానే వాడి వేడి విమర్శలను గుప్పించారు. ఈ ప్రచారంలో పదనిసలు ఏంటంటే.. ఆయనకు ప్రచార విరామంలో స్నాక్స్ కింద పకోడాలనే వడ్డించారు. రాహుల్ ఆ విధముగా.. మోడీ పకోడా ప్రకటనల గురించి సహచర కాంగ్రెసు నాయకులతో జోకులు వేసుకుంటూ.. తనతో పాటూ ఉన్న నాయకులకు స్వయంగా పకోడా ముక్కలను వడ్డిస్తూ మొత్తానికి పకోడా విందును ఆస్వాదించారు.
మరి ఇలాంటప్పుడు రాజకీయాలు మొత్తం పకోడామయం అంటే తప్పేముంది?