స‌రిహ‌ద్దుల ర‌చ్చ వేళ‌.. వారిద్ద‌రి షేక్ హ్యాండ్!

Update: 2017-07-07 16:34 GMT
గ‌డిచిన కొద్ది రోజులుగా సిక్కిం స‌రిహ‌ద్దుల వ‌ద్ద భార‌త్ - చైనాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. భూటాన్‌కు ర‌క్ష‌గా నిలిచే క్ర‌మంలో భార‌త్ సైన్యం తీరుపై చైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. స‌రిహ‌ద్దుల్లో భ‌ద్ర‌తా సిబ్బంది మ‌ధ్య‌నే కాదు.. రెండు దేశాల నేత‌ల మ‌ధ్యా మాట‌లు తూటాల్లా పేలాయి. భార‌త్ తో పోలిస్తే.. చైనా మీడియా అయితే భార‌త్ మీద విషాన్ని భారీగా చిమ్మేసింది.

రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. భార‌త్‌.. చైనాల మ‌ధ్య 1962 నాటి వార్ రోజులు చోటు చేసుకుంటాయా? అన్న సందేహాన్ని క‌లిగించేలా ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి వేళ‌.. ఈ రెండే దేశాల‌కు చెందిన కీల‌క నేత‌లు జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్ లో మొద‌లైన బ్రిక్స్ స‌మావేశాల్లో ఎదురెదురు ప‌డ్డారు. స‌రిహ‌ద్దుల్లోని ర‌చ్చ‌ను ఇరు దేశాల‌కు చెందిన కీల‌క నేత‌లు అస్స‌లు ప‌ట్టించుకోకుండా.. ఒక‌రినొక‌రు పొగుడుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అంతేనా.. ఇరువురు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవ‌టం సీన్ ఆఫ్ ద డే గా మారింది. అయితే.. ఈ ఎపిసోడ్ లో మోడీ తీరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిందే. ఓప‌క్క చైనా నేత‌ల మాట‌ల‌కు ఘాటుగా స్పందించేందుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్న ప్ర‌ధాని మోడీ.. త‌న వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి మాత్రం చైనా నాయ‌క‌త్వంలోని బ్రిక్స్ స‌ద‌స్సును పొగిడేయ‌ట‌మే కాదు.. ఈ ఏడాది చివ‌ర్లో చైనాలోని జియామెన్ లో జ‌రిగే బ్రిక్స్ స‌ద‌స్సుకు భార‌త్ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుందంటూ చాణుక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

దీంతో.. చైనా సైతం భార‌త్ ను పొగ‌డ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిని సృష్టించారు. దీనికి త‌గ్గ‌ట్లే చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ త‌న ప్ర‌సంగంలో భార‌త్‌ను.. మోడీ స‌ర్కారును పొగిడేశారు. ఉగ్ర‌వాదంపై భార‌త్ పోరును పొగిడిన చైనా అధ్య‌క్షుడు ఆర్థిక‌.. సామాజిక రంగాల్లోనూ భార‌త్ అభివృద్ధిని మెచ్చుకోవ‌టం గ‌మ‌నార్హం. 2016లో గోవాలో బ్రిక్స్ స‌ద‌స్సును భార‌త్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన విష‌యాన్ని గుర్తు చేశారు.స‌మావేశం అనంత‌రం ఇరువురు నేత‌లు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని కాసేపు మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.

రెండురోజుల పాటు సాగే ఈ స‌మావేశానికి అమెరికా అధ్య‌క్షుడు డోనాల్ట్ ట్రంప్‌.. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌.. బ్రిట‌న్ ప్ర‌ధాని థెరిసా మే.. జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే.. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయ‌ల్ మేక్రాన్ త‌దిత‌ర‌ప్ర‌పంచ నేత‌లు హాజ‌రయ్యారు.ఈ అధినేత‌ల‌కు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్ సాద‌రంగా వెల్ కం చెప్పారు. సరిహ‌ద్దుల్లో ర‌చ్చ నేప‌థ్యంలో భార‌త్‌.. చైనా అధినేత మ‌ధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న సందేహాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ..మోడీ  నేర్పుగా వ్య‌వ‌హ‌రించార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News