మాస్క్ లేకపోతే మోతే..! రూ.2వేలు ఫైన్​..ఢిల్లీ సీఎం డేరింగ్​ నిర్ణయం!

Update: 2020-11-19 18:11 GMT
కొంతకాలంగా సైలెంట్​గా ఉన్న కరోనా వైరస్​ .. చలికాలంలో విజృంభిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. అమెరికాతో పాటు పలు దేశాల్లో కేసులు ఎక్కువతున్నాయి. అయితే భారత్​లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రంలో కరోనా తీవ్రంగా అధికంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు కఠిన నిబంధనలు విధించింది. ఒక వేళ ఎవరైనా మాస్క్​ లేకుండా బయట కనిపిస్తే రూ. 2000 ఫైన్​ విధించాలని ఆ రాష్ట్ర సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఇప్పటికే  కరోనా సెకెండ్ వేవ్ వచ్చేసినట్టు వైద్య నిపుణులు హెచ్చరికలు జారీచేశారు. దసరా, దీపావళి పండగ సందర్భంగా ఢిల్లీలో కేసులు పెరిగాయి. పండగ సీజన్ ముగిసే నాటికి వైరస్ తీవ్రత భారీగా పెరిగింది. అయితే ఢిల్లీ ప్రజల్లో కరోనా భయం తగ్గిపోవడంతో ప్రజలంతా మాస్కులు, భౌతికదూరం అన్న విషయాన్నే మరిచిపోయారు.

ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మాస్క్​ లేకపోతే భారీ జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే ప్రస్తుతం అక్కడ రూ. 500 జరిమానా అమల్లో ఉంది. అయినప్పటికి ప్రజలు పట్టించుకోవడం లేదు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రజలు మాస్కులు పెట్టుకోవడం అనే విషయాన్ని మరిచిపోయారు. దీంతో జరిమానా మొత్తాన్ని 2,000కు పెంచిన ప్రభుత్వం.. మాస్కుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ  విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

‘చలికాలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రజలు తమ ఇళ్లల్లో పండుగలు జరుపుకోవచ్చు. కానీ బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే టైంలో కచ్చితంగా మాస్కులను ధరించాలి’ అని కేజ్రీవాల్​ పేర్కొన్నారు.
Tags:    

Similar News