కేసీఆర్ మీటింగ్‌..లైట్ తీస్కున్న బెంగాల్ మంత్రి

Update: 2018-05-08 05:26 GMT
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో గ‌డిచిన కొద్దికాలంగా హ‌డావుడి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ త‌న‌కున్న అమోఘ‌మైన డ్రైవింగ్ ఫోర్సుతో అవేమీ ప్ర‌జ‌ల మీద ప్ర‌భావాన్ని చూపకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. మైకు పట్టుకున్నంత‌నే తన టార్గెట్ ప్ర‌జానీకాన్ని ఊగిపోయేలా చేసే కేసీఆర్‌.. ఎంత ప్ర‌భావ‌వంతంగా మాట్లాడ‌తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపైనా.. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు.. జాతీయ స్థాయిలో ప్ర‌భావాన్ని చూపించే కీల‌క ప్రాంతీయ పార్టీల అధినేత‌లు.. వారి పుత్ర‌ర‌త్నాల‌తో వ‌రుస పెట్టి మీటింగ్‌ లు పెడుతున్న వేళ‌.. ఆయ‌న స‌మావేశాన్ని సింఫుల్ గా తేల్చేశారు ప‌శ్చిమ‌బెంగాల్ ఆర్థిక‌మంత్రి అమిత్ మిత్రా.

వాస్త‌వానికి తెలుగు మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు కానీ.. కేసీఆర్ ప‌శ్చిమ‌బెంగాల్ టూర్ దాదాపుగా వ్య‌క్తిగ‌త‌మైన‌ద‌ని.. ఆయ‌న ఆల‌య సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో గౌర‌వంగా దీదీని క‌లిశారే కానీ.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మీద సీరియ‌స్ చ‌ర్చ‌లు ఏమీ జ‌ర‌గ‌లేద‌న్న వాద‌న‌ను వినిపించింది బెంగాల్ మీడియా. తెలుగు నేల మీద కేసీఆర్ ప్ర‌భ ఎంత‌లా వెలిగిపోతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందులోకి మీడియాకు సంబంధించి ఏం చేస్తే ఎలా వ‌స్తుంద‌న్న విష‌యంపై ఆయ‌న‌కున్న ప‌ట్టు ఈ మ‌ధ్య కాలంలో మ‌రే అధినేత‌కు లేద‌ని చెప్పాలి.

బెంగాల్ సీఎంతో త‌న స‌మావేశం గురించి కేసీఆర్ చాలానే చెప్పిన‌ప్ప‌టికీ.. ఆ రాష్ట్ర నేత‌లు మాత్రం అందుకు భిన్నంగా రియార్ట్ అవుతున్నారు. ఎవ‌రి దాకానో ఎందుకు బెంగాల్ ఆర్థిక‌మంత్రి తాజాగా అమ‌రావ‌తికి వ‌చ్చారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల‌కు వ్య‌తిరేకంగా ఒక కార్య‌క్ర‌మానికి ఏపీ రాజ‌ధాని వేదిక అయ్యింది.

దీనికి హాజ‌రైన ఆయ‌న‌.. కేసీఆర్ తో ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మీటింగ్ మీద ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న స్పంద‌న ఏమిటంటే.. మ‌మ‌త ఏడుసార్లు ఎంపీగా ప‌ని చేశార‌ని.. కేంద్ర‌మంత్రితో పాటు అనేక ప‌ద‌వుల్ని నిర్వ‌హించిన వైనాన్ని గుర్తు చేశారు. రాజ‌కీయంగా ఆమెకు చాలానే ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని.. అందులో భాగంగానే కేసీఆర్‌ తో మాట్లాడే త‌ప్పించి ప్ర‌త్యేక‌త ఏమీ లేద‌న్నారు. మ‌మ‌త ఒక్క కేసీఆర్ తో మాత్ర‌మే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో కూడా మాట్లాడుతున్నార‌ని చెప్పేశారు. ఇంత సింఫుల్ గా దీదీతో కేసీఆర్ భేటీని తేల్చేసిన ప‌శ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News