అమిత్ షా లెక్కలు చూసి సిగ్గు పడాల్సింది ఎవరు? 2

Update: 2016-03-07 07:07 GMT
ఏపీ ప్రజల సంగతేమో కానీ.. ఏపీ బీజేపీ నేతలకు సిగ్గు లేదన్న విషయం తాజాగా మరోసారి రుజువైందన్న భావన పలువురి నోట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఏపీకి ప్రత్యేకంగా చేయాల్సినవేమీ చేయని పనుల గురించి ప్రస్తావించకుండా.. అధినాయకత్వం చెప్పినట్లుగా తల ఊపి.. తమ పార్టీ చీఫ్ పేరిట ప్రకటన సిద్ధం చేసిన వైనం.. ప్రజల్లోకి వెళ్లి.. చర్చకు వస్తే.. సిగ్గు పోతుందన్న కనీస స్పృహ లేని వైనం చూస్తే.. ఏపీ ప్రజలు తమను ఏమీ అనరన్న భావన ఏపీ బీజేపీ నేతల్లో బలంగా ఉన్నట్లు కనిపించక మానదు. గడిచిన కొన్ని నెలల్లో ఏపీకి చాలా చేశామంటూ అమిత్ షా పేరిట విడుదలైన లెక్కల చిట్టాను చదివే అదృష్టాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే.. ఆలస్యం ఎందుకు..? చదవటం మొదలెట్టండి. కాకపోతే.. దయచేసి ఆవేశం వద్దు. బీపీ అస్సలే వద్దు. ఎందుకంటే.. ఆ కారణంగా మన జేబుకే దండగ అన్న విషయాన్ని మర్చిపోవద్దు సుమా.

ఏపీకి మోడీ సర్కారు చేసిన అద్భుతమైన మహోపకారాలు ఏమంటే..?

= 2014-15లో రెవెన్యూ లోటు భర్తీకి రూ.2303 కోట్లు

= రాజ్‌ భవన్‌ - శాసనసభ - సచివాలయాలకు రూ.500 కోట్లు

= 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.2,06,819 కోట్లుకు పెరగటం

= 12 జాతీయ సంస్థలు - రూ.7,000 కోట్లు

= ఐఐటీకి రూ.700 కోట్లు - ఐఐఎం రూ.680 కోట్లు

= ఐఐఎస్‌ఈఆర్‌ రూ.879 కోట్లు - ఐఐఐటీ రూ.130 కోట్లు - ఎన్‌ ఐటీ రూ.300కోట్లు

= ఎస్‌ ఎస్‌ ఓ - ఎన్‌ ఐఓటీ ఓసియన్‌ రీసెర్చ్‌ ఫెలిసిటీ తిరుపిల్లిపాలెం- రూ.250కోట్లు

= పోలవరం ప్రాజెక్టు - రూ.700 కోట్లు

= జాతీయ కామధేను పరిశోధన కేంద్రం - చింతలదేవి

= జాతీయ మత్స్య విద్యా సంస్థ - బలభద్రపురం - కాకినాడ

= భారత సౌర విద్యుత్‌ కార్పొరేషన్‌ - ఏపీ జెన్‌ కో - నెడ్‌క్యాప్‌ సంయుక్త నిర్వహణలో సౌర పార్కు

= అనంతపురంలో 1500 మెగావాట్ల సౌర విద్యుత్‌ పార్కు

= కర్నూలులో 1000 మెగావాట్ల సౌర విద్యుత్‌ పార్కు

= విశాఖపట్నం నుంచి దిల్లీకి ఏపీ ఎక్స్‌ ప్రెస్

= కాకినాడలో కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రూ.450కోట్లతో బహుళ సరకు రవాణా పార్కు

= విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి

= అంతర్జాతీయ స్థాయికి తిరుపతి విమానాశ్రయం

= రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రాత్రిపూట విమానాలు దిగే సదుపాయం

= జాతీయ రహదారులకు రూ.65 వేల కోట్లు

= 392 కి.మీ మేర జాతీయ రహదారులు

= విజయవాడలో 186 కి.మీ బాహ్యవలయ రహదారి

= గుంటూరులో యూడీజీ సెవరేజ్‌ కు రూ.540 కోట్లు

= విజయవాడలో మురికినీటి పారుదల వ్యవస్థకు రూ. 460 కోట్లు

= 20 ఆకర్షణీయ నగరాల్లో కాకినాడ - విశాఖపట్నం ఎంపిక

= అమృత్‌ పథకం ద్వారా ఏపీలో 33 పట్టణాల ఎంపిక, వీటి అభివృద్ధికి రూ.26,022 కోట్లు

= అందరికీ ఇల్లు పథకం ద్వారా 1.93 లక్షల ఇళ్ల కేటాయింపు

= అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.7500 కోట్లు

= విజయవాడ - విశాఖపట్నం మెట్రోలకు రూ.22 కోట్లు

=గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సుగంధ ద్రవ్యాల కేంద్రం

= వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.700 కోట్లు

= హుద్‌ హుద్‌ కు రూ.500 కోట్లు

= కృష్ణపట్నం అంతర్జాతీయ తోలు ఉత్పత్తుల సముదాయ ప్రాజెక్టుకు రూ.302కోట్లు

= సమీర్‌ - రూ.80 కోట్లు

= పింగళి వెంకయ్య పేరుతో విజయవాడలో ప్రత్యేక దూరదర్శన్‌ కేంద్రం

= అనంతపురంలో రూ.300 కోట్లతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌

= నాగాయలంకలో రూ.1000 కోట్లతో డీఆర్‌ డీఓ క్షిపణి పరీక్ష కేంద్రం

= బొబ్బిలిలో రూ.3,266 కోట్లతో నౌకాదళ ఎయిర్‌ స్టేషన్‌ కు ప్రతిపాదన

= అనంతపురంలో మిసైల్‌ ప్రాజెక్టు ప్రతిపాదన

= కర్నూలులో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ కు రూ.500 కోట్లు

= చిత్తూరులో వ్యక్తిగత, బృంద శిక్షణలకు రూ.600 కోట్లు

= గ్రే హౌండ్స్‌ శిక్షణ కేంద్రం

= మంగళగిరిలో ఎయిమ్స్ కు రూ.1618 కోట్లు

= విశాఖలో 500 పడకల ఈఎస్‌ ఐ ఆసుపత్రి - వైద్య కళాశాల - 200 పడకల దంత ఆసుపత్రి - కళాశాల

= విశాఖలో 120 కోట్లతో ఎల్‌ పీజీ ప్లాంట్‌(బీపీసీఎల్‌)

= రాజీవ్‌గాంధీ పెట్రోలియం సాంకేతిక పరిజ్ఞాన సంస్థకు రూ.600 కోట్లు

= బహుళ విధ సరకు రవాణా కేంద్రానికి రూ.372 కోట్లు

= తిరుపతిలో ఇండియన్‌ కులినరీ ఇనిస్టిట్యూట్‌ కు రూ.100 కోట్లు

= రూ.1800 కోట్లతో అంతర్వేదిలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌

= గ్రీన్‌ ఫీల్డ్‌ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌

= వైద్య ఉపకరణాల ఉత్పత్తి కేంద్రానికి రూ.20 వేల కోట్లు

= విజయవాడలో సీఐఈపీటీ కేంద్రం
Tags:    

Similar News