అసోం రాష్ట్రాన్ని సమూలంగా మార్చేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అసోంలో భక్తి ఉద్యమాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. తద్వారా యువత ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారని చెప్పారు. వేర్పాటు వాదులు పాలించిన సందర్భంలో యువత చేతికి ఆయుధాలు ఇచ్చారని.. అయితే వారంతా ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని చెప్పారు. భక్తి ఉద్యమంతో అసోంలో మార్పుకు శ్రీకారం చుడతామని చెప్పారు.
వేర్పాటు వాదులు అసోంను తప్పుడు మార్గంలో నడిపించేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే ఇక్కడ ప్రస్తతం యువత మొత్తం జనజీవన స్రవంతిలో కలిసిపోయి.. ప్రజలతో కలిసి బతుకుతున్నదని చెప్పారు. ఇటీవల బోడోలాండ్లో జరిగిన ఎన్నికల్లో 80 శాతం మంది ప్రజలు ఓటింగ్ వేయడమే ఇందుకు నిదర్శమన్నారు.
మరోవైపు 2021లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీపై కూడా అమిత్షా ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేయలేకపోయిందని చెప్పారు. ఇక్కడి నుంచి 18 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మన్మోహన్ సింగ్ అసోంకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. 8 వేల ఆయిల్ రాయల్టీ సమస్యలను పరిష్కరించలేకపోయారని చెప్పారు. ఆ సమస్యను బీజేపీ పరిష్కరించిందని చెప్పుకొచ్చారు.
ఇక్కడి గ్రామాల్లోని సంప్రదాయ వైష్ణవమఠాల్లోని నమ్ఘర్లకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్నదని చెప్పారు. ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. మొత్తం 8 వేల మందికి లబ్ధి చేకూరబోతుందన్నారు. ఈశాన్యరాష్ట్రాల రెండురోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన కామరూప్ జిల్లా అమిగావ్లో పర్యటించారు.