ముందుచూపు.. వ్యూహం లాంటివి లేకుండా ముందుకు పోవటం లాంటివి ఒక రాజకీయ పార్టీకి.. అందునా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలో కనిపించటం చాలా అరుదు. ఏపీ బీజేపీ నాయకత్వాన్ని.. ఆ పార్టీ నేతల్ని చూస్తే ఇదే భావన కలుగక మానదు. ఎవరి మీద పోరాడాలి? ఎందుకు పోరాడాలి? లాంటి వాటి మీద దీర్ఘకాలిక వ్యూహం లేకుండా.. అప్పటికి మనసుకు తోచిన నిర్ణయాల్ని తీసుకునే ఏపీ బీజేపీనేతలకు ఎప్పుడూ లేని రీతిలో కొత్త అనుభవం ఎదురైంది. పార్టీలో మోడీ తర్వాత అన్నీ తానై వ్యవహరించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గట్టి క్లాస్ తీసుకున్నారు.
ఏపీలో ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు.. ఏపీ కమలనాథులకు మధ్య పంచాయితీ నడుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు సదరు మీడియా సంస్థకు సంబంధించిన ప్రతినిధులను పిలవట్లేదు. ఇదే విషయం షా భేటీ సందర్భంగా ఏపీ కమలనాథుల భేటీలో చర్చకు వచ్చింది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో జరిగిన చర్చ సందర్భంగా పార్టీ నేతతో ఘర్షణ జరిగిందంటూ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
దీనిపై స్పందించిన ఆయన.. ఎవరిని సంప్రదించి అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారని కాసింత గట్టిగా ప్రశ్నించగా.. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. విమర్శల్ని సానుకూలంగా తీసుకోవాలే కానీ.. భయపడే వారు నాయకులుగా ఎలా ఎదుగుతారని ప్రశ్నించి.. అలాంటి తప్పులు చేయొద్దని క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. ఏపీలో సదరు మీడియా సంస్థతో పంచాయితీ ఉండగా.. అదే మీడియా సంస్థతో తెలంగాణలో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో షా రియాక్టైన తీరు పార్టీ నేతలకు షాకింగ్ గా మారిందంటున్నారు.
మొత్తంగా.. షా ప్రశ్నలకు ఏపీ బీజేపీ నేతలు నీళ్లు నమలటం మినహా మరేమీ చేయలేకపోయారని చెబుతున్నారు. మీడియా సంస్థ విషయంలో పార్టీ తీరు ఎలా ఉండాలన్న దానిపై తాజాగా రియాక్టైన తీరుతో క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. మరి.. షా వ్యాఖ్యల నేపథ్యంలో సదరు మీడియా సంస్థతో తెగ తెంపులు చేసుకున్న ఏపీ కమలనాథులు.. మరి ప్యాచప్ ఎలా చేస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.