అమిత్ షా హైదరాబాద్ కు వచ్చింది అందుకేనట

Update: 2016-05-30 04:42 GMT
బీజేపీ చీఫ్ అమిత్ షా హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. మోడీ సర్కారు రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విజయోత్సవాల్ని భారీగా నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలు బిజీబిజీగా ఉండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమిత్ షా మాత్రం తన హైదరాబాద్ పర్యటనను మోడీ రెండేళ్ల విజయోత్సవం కోసం కాకుండా మరో పని మీద వచ్చినట్లుగా ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.

మరో మూడేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బలపడాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ.. అందుకు తగ్గ వ్యూహాన్ని సిద్ధం చేసి.. అమలు షురూ చేయాలన్న ఆలోచనతో అమిత్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. 2019లో ఏపీ.. తెలంగాణ.. ఒడిశాలు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాయని.. ఆ సమయానికి ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతమై.. తన సత్తా చాటాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారని.. అందుకు సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేసే కీలకమైన పనిలో భాగంగా అమిత్ తాజా పర్యటన ఉంటుందని చెబుతున్నారు.

బూత్ స్థాయి నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం వరకూ కార్యకర్తల దళాన్ని పటిష్ఠంగా నిర్మించాలన్నదే తన ఆలోచనగా చెబుతున్న అమిత్ షా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఒడిశాలోనూ కమలవికాసం చేయాలని తలపోస్తున్న అమిత్ షా ఎంతమేర సక్సెస్ అవుతారన్నది కాలమే డిసైడ్ చేయాల్సిందే. అప్పటివరకూ అమిత్ షా చెప్పే మాటల్ని శ్రద్ధగా వినాల్సిందే.

Tags:    

Similar News