శబరిమలకు వెళ్లనున్న అమిత్ షా

Update: 2018-10-30 10:28 GMT
శబరిమల వివాదంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని సీపీఎం ప్రభుత్వంపై పోరుబాటుకు సిద్ధమయ్యారు. శబరిమల నిరసనకారులపై సీఎం పినరయి విజయన్ కఠినంగా వ్యవహరించడంపై గత వారం అమిత్ షా పర్యటించి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.. నిరసనకారులపై దాడులు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగుతారని వార్నింగ్ ఇచ్చారు.

కేరళలోని సీపీఎం ప్రభుత్వం శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆర్ ఎస్ ఎస్ బీజేపీ కార్యకర్తలు 3500మందిని అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. దీనిపై అమిత్ షా స్వయంగా హాజరై కేరళలో సభ పెట్టి మరీ నిరసన తెలిపారు. శబరిమలలోకి మహిళలను ప్రవేశించడాన్ని బీజేపీ కూడా వ్యతిరేకిస్తోందని.. నిరసనకారులకే తమ మద్దతు అని అమిత్ షా ప్రకటించారు.

తాజాగా మరోసారి శబరిమల వివాదంపై అమిత్ షా డేరింగ్ స్టెప్ వేశారు. నవంబర్ 17 నుంచి శబరిమల వార్షిక యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్కడికి స్వయంగా వెళ్లి పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు తమ పార్టీ మద్దతు ఉందని తెలియజేయడానికే ఇలా పర్యటిస్తున్నట్టు తెలిపారు. దీంతో శబరిమల వివాదంపై బీజేపీ దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
   

Tags:    

Similar News