ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వేళ.. టీవీ ఛర్చల సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ముఖ్య పార్టీలకు చెందిన నేతల్ని కూర్చోబెడతారు. ఎన్నికల ఫలితాలు మొదలు కాక ముందే చర్చలకు వచ్చేవారు.. ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యే వరకూ చర్చలో పాల్గొంటారు. ఈ సందర్భంగా తమ పార్టీకి సీట్లు రాకున్నా.. ఓడిపోతున్నా దానిని ఒప్పుకోకుండా.. ఏమో.. ఇంకా ఫలితాలు పూర్తిగా విడుదల కాలేదు కదా.. లాంటి మాటలు చెబుతుంటారు.
ఓ పక్క టీవీ స్ర్ర్కీన్ ల మీద ఫలితాల సరళి చూసిన తర్వాత కూడా తమ ఓటమిని ఒప్పుకోవటానికి అట్టే ఇష్టపడరు. టీవీ ఛర్చల్లో కూర్చున్న వారు.. చూస్తూ.. చూస్తూ తమ పార్టీ ఓడిపోతుందంటే ఒప్పుకోవటం.. అంగీకరిస్తే ఏం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో అలా మాట్లాడి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ.. ఒక పాలకపక్షానికి చెందిన పార్టీ జాతీయాధ్యక్షుడు దాదాపు ఇలాంటి వైఖరిని ప్రదర్శించటం కాస్తంత ఆశ్చర్యమే.
శుక్రవారం సాయంత్రంతో.. ఐదు దశల్లో సాగిన బీహార్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆ వెంటనే.. జాతీయ స్థాయిలోని వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. వీటిల్లో ‘‘టుడేస్ చాణుక్య’’ ఒక్కటి మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి భారీ మెజార్టీతో సీట్లు లభించి.. బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న సందేశాన్ని ఇచ్చింది.
మిగిలిన మీడియా సంస్థల్లో సిసిరో కూడా ఎన్డీయే వైపు మొగ్గు చూపినప్పటికీ.. మహాకూటమికి.. బీజేపీకి మధ్య సీట్ల వ్యత్యాసం తక్కువగా ఉన్నట్లు చూపింది. వీటికి భిన్నంగా టుడేస్ చాణుక్య మాత్రం బీజేపీ కూటమికి 155 సీట్లు (11 సీట్లు ఎక్కువ కానీ.. తక్కువ కానీ) రావొచ్చని తేల్చగా.. జేడీయూ మహాకూటమికి 83 (6 సీట్లు ఎక్కువ కానీ.. తక్కువ కానీ) రావొచ్చని తేల్చింది.
మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 122 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన మెజార్టీని బీజేపీ కూటమి సొంతం చేసుకుంటుందని టుడేస్ చాణుక్య తేల్చింది. తమకు అత్యంత అనుకూలమైన ఫలితాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్న అమిత్ షా ఆ ఒక్క ఎగ్జిట్ పోల్ ను మాత్రమే రీ ట్వీట్ చేశారు. ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు లాంటి వ్యక్తి అయితే.. అన్ని ఎగ్జిట్ పోల్స్ ను రీట్వీట్ చేసి.. ఏదైనా వ్యాఖ్యానిస్తే బాగుండేది.
తమకు స్పష్టమైన మెజార్టీ లభిస్తుందన్న టుడేస్ చాణుక్య తప్పించి.. మరే ఇతర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అమిత్ షా దృష్టిని ఆకర్షించకపోవటం గమనార్హం. తమకు తిరుగులేని విజయం ఖాయమని చెప్పిన చాణుక్య ఎగ్జిట్ పోల్ ను మాత్రమే రీట్వీట్ చేసిన తీరు చూస్తే.. గల్లీ నాయకుడి మాదిరే.. ఢిల్లీ నాయకుడు వ్యవహరించారన్న భావన కలగటం ఖాయం.