సీఏఏపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

Update: 2022-11-25 06:30 GMT
వివాదాస్పద 'సీఏఏ' ఇప్పటికే ప్రభుత్వం నుండి ఆమోద ముద్ర పొందిందని, విమర్శకులు ఇప్పుడు చట్టాన్ని వెనక్కి తీసుకుంటారని లేదా అమలు చేయరని కలలు కనడం మానుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం సంచలన కామెంట్స్ చేశారు. న్యూఢిల్లీలో ఓ సమ్మిట్‌లో ప్రసంగించిన అమిత్ షా దేశవ్యాప్తంగా నిరసనలు.. హింసకు దారితీసిన వివాదాస్పద చట్టమైన 'ఎన్‌ఆర్‌సి మరియు సిఎఎ'లను కోల్డ్ స్టోరేజీలో పెట్టలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.  అమలులో జాప్యం గురించి అడిగినప్పుడు కోవిడ్ -19 మహమ్మారి-ప్రేరేపిత లాక్‌డౌన్‌లు సీఏఏ అమలు ప్రక్రియను ఆలస్యం చేశాయని, మిగిలిన ఫార్మాలిటీలను త్వరలో ముగిస్తామని కేంద్ర హోం మంత్రి చెప్పారు.

'సిఎఎ, ఎన్‌ఆర్‌సిని కోల్డ్ స్టోరేజీలో పెట్టలేదు. సీఏఏ అనేది ఒక చట్టం, దీనిని ఇప్పుడు మార్చలేము. మేము నిబంధనలను రూపొందించాలి, ఇవి కోవిడ్-19 కారణంగా ఆలస్యం  అయ్యింది. అయితే ఈ పని త్వరలో ప్రారంభమవుతుంది. సీఏఏ అమలు కాబోదని ఎవరూ కలలో కూడా అనుకోకూడదు. అలా ఆలోచించే వారు పొరబడుతున్నారు' అని అమిత్  షా అన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ సమస్యపై, టైమ్స్ నౌ నవభారత్ ఎడిటర్-ఇన్-చీఫ్ నవికా కుమార్‌తో జరిగిన ఫైర్‌సైడ్ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఇది బిజెపి వాగ్దానమని, రాష్ట్రాలు 2024 నాటికి చట్టాన్ని అమలు చేయకపోతే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటుందని తెలిపారు. 'రాజ్యాంగ సభ రాష్ట్ర శాసనసభలు , పార్లమెంటుకు సరైన సమయం దొరికినప్పుడల్లా యూసీసీని అమలు చేయాలని సూచించింది. మతం ప్రాతిపదికన చట్టాలు రూపొందించకూడదు' అని అమిత్  షా అన్నారు.

బీజేపీ విజయ పరంపరలో ప్రధాన పాత్ర పోషిస్తూ 'రాజకీయ సూత్రధారి' గా పేరు తెచ్చుకున్న అమిత్ షా తన పార్టీ ప్రధాన విలువలు మరియు విశ్వాసాలకు ఘనత వహించారు. హిందుత్వ ఏజెండాకు ఆయన పెద్దపీట వేస్తుంటారు. అదే తమను విజయం దిశగా నడిపిస్తుందని భావిస్తారు. అందుకే సీఏఏను మరోసారి తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది.

ఇక గుజరాత్ ఎన్నికల రేసులో ఆప్ ఉనికిని తగ్గించిన అమిత్ షా, ప్రధాన పోటీ కాంగ్రెస్ -బీజేపీ మధ్యేనని పేర్కొన్నారు. ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఇమేజ్‌ను వక్రీకరించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చేసిన వాదనపై స్పందించిన అమిత్ షా బీజేపీపై నిందలు వేసే బదులు, ఆ వీడియోలు నిజమా, నకిలీవా అని ఆప్ సమాధానం చెప్పాలని షా అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News