నరేంద్రమోడీ, అమిత్ షా.. జోడు గుర్రాలు.. ఒకరు ప్రభుత్వాన్ని.. మరొకరు పార్టీని దిగ్విజయంగా నడిపించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ దేశంలోనే అత్యంత శక్తివంతులైన నేతలుగా ఎదిగారు. ఇప్పుడు 2019లో కూడా అమిత్ షా సారథ్యంలో బీజేపీ మరోసారి ఎన్నికలకు వెళ్లింది. గెలిచింది. అమిత్ షా ఈసారి గాంధీనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు కేంద్రంలో కీలక మంత్రి పదవి దక్కనుందనే వార్త బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా ఇన్నాళ్లు పార్టీ బాధ్యతలతో తెరవెనుకే ఉన్నారు. అందుకే ఇప్పుడు కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని మోడీ డిసైడ్ అయినట్లు తెలిసింది. త్వరలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి .. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే అమిత్ షా వలే బలమైన కీలక నేత ఎవరనేదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. అంతటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయనే నేత కోసం బీజేపీ అధిష్టానం అన్వేషిస్తోంది. ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
కేంద్రమంత్రిగా.. రాజ్యసభ ఎంపీగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జేపీ నడ్డా పేరు ముందంజలో ఉంది. ఆ తర్వాత ధర్మేంద్రప్రదాన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. నడ్డా మొన్నటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చేపట్టి అక్కడ బీజేపీకి 62 ఎంపీ సీట్లను గెలిపించడంలో కృషి చేశారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషాలో అస్సలు లేని బీజేపీని ఈసారి ప్రతిపక్షంగా నిలబెట్టారు. 39శాతం ఓట్లను ఒడిషాలో రాబట్టారు. వీరిద్దరిలో ఒకరిని జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇక మోడీ తర్వాత కేంద్రంలో రెండో నంబర్ పోస్టును అమిత్ షాకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.
30న మంత్రులుగా తీసుకునే జాబితాపై మోడీషాలు మంగళవారం కీలక సమాలోచనలు జరిపారు. ఇందులోనే అమిత్ షాకు ఏ శాఖ అప్పగించాలనే దానిపై చర్చ జరిగింది.