ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ విషయంలో విభిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారా? తెలంగాణలో టీఆర్ ఎస్ తో సఖ్యతగా ఉండాలనే బీజేపీ లక్ష్యం మారుతోందా? మజ్లిస్ సంతుష్టీకరణ విధానాలు అవలంబిస్తున్న టీఆర్ ఎస్ ను ఇకపై కమలం లక్ష్యంగా ఎంచుకుందా? అందుకే మజ్లిస్ భుజంపై తుపాకిపెట్టి కేసీఆర్ కు గురిపెట్టిందా? హిందువులకు చేరువయ్యే వ్యూహంలో భాగంగానే రజాకార్ల అరాచకాలను మరోసారి తూర్పారబట్టిందా? తిరంగాయాత్ర ముగింపు సందర్భంగా - తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నుంచి - లక్ష్మణ్ వరకూ సంధించిన విమర్శనాస్త్రాలు పరిశీలిస్తే ఇలాంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి
ప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జరిపిన ఆసాంతం టీఆర్ ఎస్ ను లక్ష్యంగా చేసుకునే సాగింది. మజ్లిస్ ను భుజానికెత్తుకున్న టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరును అమిత్ షా సైతం నేరుగానే విమర్శించారు. ఒక్క మజ్లిస్ అనుకూల విధానాలపైనే కాకుండా - కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనూ దునుమాడటం ద్వారా - ఇకపై తమకు తెరాసతో యుద్ధం తప్పదన్న హెచ్చరికలు పంపారు. కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ సంగతి ఏమిటని - కేంద్ర నిధులు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని, మొత్తం నిధులను కేసీఆర్ కంపెనీ నీరుగారుస్తోందంటూ అమిత్ షా విమర్శల వర్షం కురిపించడం ద్వారా, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టయింది. దేశంలో ప్రతి 15 రోజులకు ఓ కొత్త పథకం చేపడుతుంటే తెలంగాణలో ఒక్క పథకం కూడా లేదని ఎద్దేవా చేయటం ద్వారా, ప్రజల్లో కేసీఆర్ పాలనపై కొత్త ఆలోచనకు బీజం వేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఒవైసీకి - మజ్లిస్ కు భయపడి స్వాతంత్య్రదినోత్సవం జరపడం లేదని - మిమ్మల్ని గెలిపించింది ప్రజలే తప్ప - ఒవైసీ కాదన్న విమర్శ.. చాలాకాలం నుంచి మజ్లిస్ కు అనుకూలంగా ఉన్న తెరాస వైఖరిపై అసంతృప్తితో ఉన్న హిందువులను ఆకట్టుకునే వ్యూహంగానే స్పష్టమవుతోంది.
మిగిలిన ప్రతిపక్షాల మాదిరిగా అమిత్ షా కూడా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షను వదలకపోవడం విశేషం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తున్నారంటే ఊరకనే వస్తారా? అని ప్రశ్నించారు. అంటే వారిని కొనుగోలు చేశారని చెప్పకనే చెప్పినట్లయింది. అమిత్ షా తన ప్రసంగం ప్రారంభంలో కేసీఆర్ కు వినిపించేలా భారత్ మాతాకీ జై అనాలని పిలుపునిచ్చి - చివర్లో మజ్లిస్ పెత్తనం పోవాలంటే బిజెపిని బలోపేతం చేయాలని వ్యాఖ్యానించటం బట్టి తెలంగాణలో బిజెపి అడుగులు ఏమిటనేది అమిత్ షా శ్రేణులకు స్పష్టం చేసినట్టయింది.కేంద్రమంత్రి దత్తాత్రేయ సైతం కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించటం ప్రస్తావనార్హం. డాక్టర్ లక్ష్మణ్ నేరుగా కేసీఆర్పైనే విమర్శనాస్త్రాలు సంధించారు. వీరందరికంటే కిషన్ రెడ్డి కేసీఆర్ - ఒవైసీలపై చేసిన తీవ్ర విమర్శలు పరిశీలిస్తే రాష్ట్రంలో తెరాసతో యుద్ధం తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా, ఇదే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించినపుడు టీఆర్ ఎస్ పాలనను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షా అందుకు భిన్నంగా మాట్లాడటం - పైగా టార్గెట్ చేసినట్లు ఉండటం చూస్తుంటే బీజేపీ కోణం మారిందనే వాదన వినిపిస్తోంది.