కాకి లెక్కలు చెప్పటంలో బీజేపీ చీఫ్ అమిత్ షా తర్వాతే ఎవరైనా. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను.. ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చే నిధులకు సంబంధించిన లెక్కల్ని వేసి మరీ.. అదంతా కేంద్రమే ఉచితంగా రాష్ట్రాలకు దానం చేసినట్లుగా చెప్పటం ఆయనకే చెల్లుతుంది. తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కారు ఎంత మేర సాయం చేస్తుందో రెండు రాష్ట్రాల్లోని తెలుగువారందరికి బాగానే తెలుసు. కానీ.. అవేమీ జనాలకు తెలియవని అనుకుంటారేమో కానీ.. ఓ పెద్ద బహిరంగ సభ పెట్టి మరీ తాము రాష్ట్రాలకు ఎంత ఉదారంగా నిధులు ఇస్తున్నామో చెప్పేస్తారు. బహిరంగ సభ కాబట్టి.. సార్ మీరు చెప్పే రూ.90 వేల కోట్లను ఏయే పద్దుల కింద ఇచ్చారన్నది అడగరు కాబట్టి ఆయనంత ధీమాగా అంకెలు చెప్పేస్తారేమో?
ఈ తరహా మాటలు తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ గతంలో చెప్పారు. ఆ మధ్యన రాజమండ్రిలో సభ నిర్వహించి ఏపీకి రెండేళ్ల వ్యవధిలో రూ.లక్ష కోట్లకుపైనే నిధులు ఇచ్చేసినట్లుగా చెప్పేసి షాకిచ్చారు. అమిత్ మాటల్ని విన్న వారంతా ఒక్కసారి షాక్ తినే పరిస్థితి. అన్నేసి వేల కోట్లు ఏపీకి ఇచ్చే బాబు ఎందుకలా మాట్లాడుతున్నారన్న భావన కలిగినా.. తర్వాత అమిత్ సా అయ్యగారి బ్రేకప్ చూసినోళ్లకు అసలు విషయం అర్థమై.. ఏం కాకి లెక్కలు చెప్పారో అని అనుకునే పరిస్థితి.
ఏపీ అనుభవంతో అయినా బుద్ధి తెచ్చుకొని పద్దతిగా మాట్లాడితే బాగుండేది. కానీ.. తనకు అలవాటైన ధోరణిని మార్చుకోని అమిత్ షా.. తెలంగాణకు తామేదో మేలు చేసినట్లుగా తెగ కబుర్లు చెప్పేశారు. తాము భారీగా నిధులు ఇచ్చినా అవన్నీ ప్రజల దగ్గరకు చేరటం లేదని.. కావాలంటే తాము ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు చెబుతామంటూ బీరాలు పలికారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రోడ్లు.. ప్రతి గ్రామానికి ఆసుపత్రి.. ప్రతి పొలానికి నీళ్లు.. కొత్త ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించిన ఆయన.. అవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని.. కాశ్శీర్ నుంచి కన్యాకుమారి వరకూ కుటుంబ రాజకీయాలతో బాగుపడిన రాష్ట్రం ఏదీ లేదంటూ మండిపడ్డారు.
తెలంగాణలో ఓవైసీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వగలరా? అని ప్రశ్నించిన ఆయన.. ఆయనకు బదులిచ్చే పార్టీ తమదేనని చెప్పుకున్నారు. మిగిలిన మాటల్ని సర్లేనని సర్దుకున్నా.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలే ఒళ్లు మండేలా చేస్తాయనటంలో సందేహం లేదు. మరి అమిత్ షా చెప్పిన లెక్కలపై తెలంగాణ అధికారపక్షం ఎంతటి తిట్ల దండకాన్ని అందుకుంటుందో చూడాలి.