కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ..పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుసాగుతుంది. దేశంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకి సైతం ఒక సమాధానం ఇస్తూ పాలన కొనసాగిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఎన్నార్సీ బిల్లు ( పౌరసత్వ సవరణ బిల్లు ). మోడీ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నార్సీ సవరణ బిల్లు నేడు లోక్ సభ ముందుకు రాబోతుంది.
పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై అదే రోజు చర్చించి - బిల్లుకు ఆమోదం కూడా తెలపాలని నిర్ణయించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే - పాకిస్థాన్ - బంగ్లాదేశ్ - అఫ్ఘానిస్థాన్ లో మత పీడనకు గురై అక్కడి నుంచి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. 1955లో రూపొందించిన ఈ ఎన్నార్సీ బిల్లుకు సవరణలు చేసిన కేంద్రం.. ఉభయ సభల్లో ఈ బిల్లును ఎలాగైనా కూడా పాస్ చేయించుకోవాలని చూస్తోంది.
గతంలో 11 ఏళ్లపాటు దేశంలో ఉంటేనే పౌరసత్వం ఇచ్చేవారు. సవరణ చట్టంలో దానిని ఐదేళ్లకు కుదించారు. కాగా, ఈ ఎన్నార్సీ సవరణ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సవరణ బిల్లులో ముస్లింలను చేర్చకపోవడం పలు వివాదాలకు కేరాఫ్ గా మారింది. అక్రమంగా వచ్చిన శరణార్థులను శాశ్వత నివాసులుగా పరిగణిస్తే - ఈ ప్రాంత జనాభా వివరాల్లో మార్పులు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు - పెద్దఎత్తున ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు అయితే , బీజేపీ మాత్రం ఈ బిల్లుని పాస్ చేయించాలని గట్టి పట్టుదలతో ఉంది. లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉండటం తో లోక్ సభలో ఈజీగా ఆమోదం చెందుతుంది. కానీ , రాజ్యసభలో మాత్రం కొంచెం కష్టతరం అయ్యే ఛాన్స్ ఉంది