మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండగా... నోటిఫికేషన్ రాకముందే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పలు అభివృద్ధి పథకాల రూపంలో ఓటర్ల మూడ్ మార్చేందుకు గేమ్ మొదలుపెట్టింది. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆయనకు అండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారు.
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వివిధ పథకాల రూపంలో ప్రజలను ఆకర్షిస్తున్న తరుణంలో బీజేపీ అలర్ట్ అయింది. గతంలో జరిగిన పొరపాట్లు మరోమారు జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ హైకమాండ్ నేతలు ఎవరూ అక్కడ పర్యటించలేదు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందుకోసం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్న బీజేపీ సుదీర్ఘకాల డిమాండ్ రూపంలో ప్రచారం జోరెక్కిస్తున్నారు.
తెలంగాణ విమోచన దినం అయిన సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని సమాచారం. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన రోజుల్లో ఒకటైన సెప్టెంబర్ 17న ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా అమిత్ షా ప్రచారంతో ఉప ఎన్నిక మరింత హీటెక్కడం ఖాయం. మరి ఈ ఎత్తుగడకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.