ప్రధాని నరేంద్రమోడీ ప్రచారంలో దిట్టన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేటెస్టు ట్రెండ్లను పట్టుకోవడంలోనూ ఆయన చాలా ముందుంటారు. ఆలా ట్రెండు తెలిసినవారే ఆయన టీంలో ఉంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ హీరో అయిన మోడీ అంతకుముందు ఎన్నికల సమయంలోనూ 3డీ టెక్నాలజీలతో ప్రచారాన్ని పరుగులు తీయించారు. తాజాగా ఆయన తన పాపులారిటీ ఏమాత్రం డౌన్ కాకుండా, వీలయితే మరింత పెరిగేలా చేసుకునేలా కొత్త ప్లాన్ వేశారు. ఆ ప్లాను అమలు బాధ్యత అనుంగు శిష్యుడు అమిత్ షా పై పెట్టారు. ఆయన యాక్షన్ లోకి దిగడానికి రెడీ అవుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాబల్యాన్ని మరింతగా పెంచేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టెక్ రూటు పట్టారు. ప్రజల చేతుల్లో.. మరీ ముఖ్యంగా యువత చేతుల్లో తప్పనిసరైపోయిన స్మార్టు ఫోన్లపై ఆయన కన్నేశారు. పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు, మోదీ పేరు యువతలో నిత్యం వినిపించేందుకు ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ పేరిట తయారైన మొబైల్ యాప్ 'నమో'ను దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో లక్ష డౌన్ లోడ్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. 570 జిల్లాలుండగా, ప్రతి జిల్లాలో లక్ష ఫోన్లలో ఈ యాప్ ను చేర్చాలని, తద్వారా మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మరింత సులువుగా వారికి తెలియజేయవచ్చని ఆయన భావిస్తున్నారు.
ఇండియాలోని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫ్లిప్ కార్టు, ఉబెర్, వాట్సాప్, ఫేస్ బుక్ వంటి కొన్ని యాప్ లు మాత్రమే 5 కోట్లకు మించిన డౌన్ లోడ్లను నమోదు చేసుకున్నాయి.. ప్రస్తుతం నమో యాప్ డౌన్లోడ్ల సంఖ్య 10 లక్షల వద్ద ఉంది. దీన్ని అన్ని జిల్లాలకూ విస్తరించే దిశగా, అమిత్ షా వేసిన మాస్టర్ ప్లాస్ అమలైతే, ఈ యాప్ కూడా అంతే స్థాయిలో విజయవంతమవుతుంది. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలున్న నేపథ్యంలో, ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళితే, అనుకున్న లక్ష్యం చేరడం సులువని అమిత్ షా టీం అనుకుంటోంది.