మిత్రపక్షాలుగా ఉండి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారిన పార్టీలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హెచ్చరికలు పంపారు. తమను కాదని ఒంటరిగా పోటీచేస్తే ఆ పార్టీల అంతు చూస్తామని.. ఓడించడంతోపాటు వాటికి ఇబ్బందులు తప్పవని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. కలిసి పనిచేస్తే స్వాగతిస్తామని.. విడిపోతే చెడిపోతారని వార్నింగ్ ఇచ్చారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లాతూరు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా శివసేనపై మండిపడ్డారు. 2019లో ఒంటరిగా పోటీచేస్తానన్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు. ఒంటరిగా పోటీచేసే పార్టీలకు గట్టి బుద్ది చెబుతామని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలే గెలుస్తాయని చెప్పుకొచ్చారు. పొత్తుల గురించి కార్యకర్తలు ఆందోళన చెందకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. బీజేపీతో శివసేన సాగితే వారి విజయానికి కృషి చేద్దామని లేదంటే ఓడిద్దామని అమిత్ షా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాల గెలుపుపై దృష్టి సారించాలని చెప్పిన అమిత్ షా.. పొత్తుల గురించి కూడా ఆలోచిస్తామని చెప్పడం కొసమెరుపు..
అమిత్ షా వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. గతేడాది.. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ స్థానం ఏంటో ప్రజలు తేల్చేశారని.. మహారాష్ట్రలో కూడా ప్రజలు బీజేపీకి బుద్ది చెబుతారని శివసేన అభిప్రాయపడింది. బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడే అవకాశాలున్నాయని విమర్శించింది. ఈవీఎంలతోనే బీజేపీ పొత్తు కుదుర్చుకోవాలని సెటైర్ వేసింది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీజేపీ తలపొగరు తగ్గలేదని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యాలు అభ్యంతరకరమన్నారు. హిందుత్వ, రామమందిర నిర్మాణంపై శివసేన తీసుకున్న స్టాండ్ బీజేపీకి నచ్చడం లేదని మండిపడ్డారు.