పార్టీ శ్రేణులకు అమిత్ వార్నింగ్......

Update: 2018-08-13 12:09 GMT
రాజ్యసభ సభ్యుడు - భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీలో తన నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఎన్నికలు తరుముకొస్తున్న సందర్భంగా ఎట్టి పరిస్థితిల్లోను నోరు జారకూడదని - వివాదలలోకి వెళ్లకూడదని ఆయన తన పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. అంతే కాకుండ వివాదాస్పద వ్యాఖ్యలు చేసీ, మీడియా ద్రుష్టిలో పడవద్దని అమిత్ షా ఆదేశించినట్టు తెలిసింది. గతంలో హేమమాలిని తాను తలచుకుంటే ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి కాగలనని వ్యాఖ్యానించారు. అలాగే గతంలో ముంబాయ్‌ లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది అసువులు బాసారు. ఈ సందర్భంగా హేమమాలిని పెరుగుతున్న జనాభానే ఇటువంటి సంఘటనలకు కారణమని చెప్పి పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. ఇటువంటి అనుభావాలు ద్రుష్టిలో ఉంచుకుని అమిత్ షా ఈ వ్యాఖ్యాలు చేసినట్లు సమాచారం.

అంతేకాకుండ భారతీయ పార్టీ నాయకులైన సంగీత్ సామ్ - సంజీవ్ బల్యాన్ - సురేష్ రాణా తరచు వివాదస్పద వ్యాఖ్యాలు చేసి వివాదలలో ఇరుక్కుంటున్నారు.పార్టీ నేతలందరూ తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించినట్టు తెల్సింది. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత 2014 ఎన్నికల తర్వాత తమ నియోజకవర్గమైన కాన్పూర్‌ లో చూడలేదని విమర్శలోస్తున్నాయి. ఇవన్నీ పునస్కరించుకుని అమిత్ షా తన పార్టీ శ్రేణులకు వివాదస్పద వ్యా‌ఖ్యాలు చేయవద్దని ఆదేశించినట్టు సమాచారం.


Tags:    

Similar News