2024 ప్రధాని అభ్యర్థి పై అమిత్ షా కీలక ప్రకటన

Update: 2021-10-30 05:49 GMT
కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. గత కొన్ని రోజులు గా జరుగుతోన్న ప్రచారానికి ఒక ముగింపు ఇచ్చారు. గత కొన్ని రోజులు గా సోషల్ మీడియా లో త్వరలో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ కి జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సీఎం గా వేరే వ్యక్తిని నియమిస్తారంటూ ఓ వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే ఈ వార్త ను తాజాగా అమిత్ షా తోసిపుచ్చారు. ఆ వార్తల్లో ఎటు వంటి నిజం లేదు అని వెల్లడించారు. 2022 లో మరో సారి యోగి ఆదిత్యనాథే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. అలాగే 2024 లో మోడీనే మూడో సారి ప్రధాని కానున్నారని కీలక ప్రకటన చేశారు.

యూపీ లో శుక్రవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కు 2022 లో పునాది పడాలని అమిత్ షా కోరారు. దీపావళి తర్వాత ఎన్నికల హీట్ పుంజుకోనుందని, కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం పని చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో 300 సీట్ల లో గెలుపే టార్గెట్‌ గా పని చేయాలని కీలక సూచనలు చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు లక్నో లో మేరా పరివార్-బీజేపీ పరివార్ అనే బీజేపీ సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించారు.

ప్రధాని మోడీ విదేశాల్లో ఉన్నారని, ఇక్కడి వాయిస్ అక్కడి కి చేరాలని అమిత్ షా అన్నారు. బీజేపీ సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు నేను ఉత్తరప్రదేశ్‌ లోని చారిత్రక భూమి కి వచ్చానని ఆయన అన్నారు. దీంతో పాటు దీపావళి రోజున ప్రతి ఇంటి లో ‘నా కుటుంబం-బీజేపీ కుటుంబం’ అంటూ ఆమోదం తెలపాలని ప్రచారం కూడా మొదలవుతోంది. ఉత్తర ప్రదేశ్‌ కు మళ్లీ గుర్తింపు తెచ్చేందుకు బీజేపీ కృషి చేసిందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల రోమ్ పర్యటన సందర్భం గా శుక్రవారం పియాజా గాంధీ వద్ద మహాత్మ గాంధీ విగ్రహాని కి నివాళి అర్పించారు. ప్రపంచానకి ఆయన అందించిన స్ఫూర్తి కొనసాగుతుందని అన్నారు. జీ-20 సదస్సు లో పాల్గొనేందు కు ప్రధాని నరేంద్ర మోడీ రోమ్‌ లో పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి రోమ్‌లో దాదాపు 60 గంటల పాటు ఉంటారు. ప్రధాని తన పర్యటన లో ఎనిమిది దేశాల నేతలు లేదా అధినేతల తో సమావేశమవుతారు. ఇటలీ, స్పెయిన్, సింగపూర్ ప్రధానులు, జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్, ఇండోనేషియా అధ్యక్షుల తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.దీంతో పాటు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుల తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. దౌత్య సమావేశాలే కాకుండా అందరి దృష్టి ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ ల భేటీ పైనే ఉంటుంది
Tags:    

Similar News