తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ఉంటుందా? లేదా? అన్న ప్రశ్న కోటి రూకల ప్రశ్నగా చెప్పాలి. వార్తలకు కొరత ఉన్న ప్రతిసారీ రజనీ రాజకీయ రంగప్రవేశం గురించికాసింత హడావుడి చేయటం తమిళ మీడియాకు అలవాటుగా చెబుతారు. అన్నాడీఎంకేలో నెలకొన్నరాజకీయ సంక్షోభం కారణంగా చేతి నిండా పని ఉన్న వేళ.. రజనీ రాజకీయ రంగప్రవేశం గురించి జోరుగా వార్తలు రావటం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగటం గమనార్హం.
సీఎం పదవి కోసం చిన్నమ్మ.. పన్నీర్ సెల్వం పెద్ద ఎత్తున పోటీ పడుతున్న వేళ.. రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద ఆసక్తికర చర్చ మొదలైంది. ఆయన త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని.. సూపర్ స్టార్ కొత్త పార్టీని పెట్టబోతున్నారని.. ఇందుకు ఆర్ ఎస్ఎస్ నేత ఒకరు సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో సూపర్ స్టార్ రాజకీయ రంగప్రవేశానికి ఇంతకు మించిన మంచి ముహుర్తం ఉండనే ఉండదని చెబుతున్నారు. అన్నాడీఎంకేలో సాగుతున్న వర్గపోరు.. డీఎంకే పైన ఉన్న స్కాం మరకల నేపథ్యంలో .. మచ్చలేని వ్యక్తిగా రజనీ మీద ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. దీనికి తోడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రజనీకాంత్ కానీ పార్టీ పెడితే.. తమిళులు ఆయన్న అభిమానించటమే కాదు.. ఆయనకు అధికారాన్ని కట్టబెడతారన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీ ఏర్పాటుపై సూపర్ స్టార్ కు బిగ్ బీ అమితాబ్ ఉచిత సలహా ఒకటి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. గతంలోతాను రాజకీయాల్లోకి వచ్చానని.. అయితే.. రాజకీయాలుతనకు ఇమడక వాటిల్లో నుంచి బయటకు వచ్చేసినట్లుగా చెప్పటమే కాదు.. రజనీని రాజకీయాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పటం గమనార్హం. దీనిపై సూపర్ స్టార్ స్పందించకున్నా.. అమితాబ్ మాటల తర్వాత కాస్తంత ఆలోచనల్లో పడినట్లుగా చెబుతున్నారు. బిగ్ బీ చెప్పిన ఉచిత సలహాపై రజనీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.