నేషనల్ హెరాల్డ్ కేసులో అమితాబ్ కూ పాపం

Update: 2015-12-15 08:04 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలకు నిద్ర లేకుండా చేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో బిగ్ బీ అమితాబ్ కు కూడా సంబంధమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ ముద్రణ సంస్థ ఏజేఎల్ లో అమితాబ్ లక్ష షేర్లు ఉన్నాయని తేలింది. అమితాబ్ కు చెందిన సంస్థ అభిమ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఈ వాటాలు ఉన్నట్లు ఓ ఛానల్ బయటపెట్టింది.  ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న అమితాబ్ ఇల్లు ప్రతీక్ష చిరునామాతోనే ఈ సంస్థ రిజిష్టరై ఉంది. దీంతో నేషనల్ హెరాల్డ్ లో అమితాబ్ వాటాలు కొనుగోలు చేసినట్లు రుజువైంది.

అమితాబ్ మాత్రం దీనిపై ఏమీ మాట్లాడడం లేదు. విలేకరులు దీనిపై గుచ్చిగుచ్చి అడుగుతున్నా ఆయన కామ్ గా ఉంటున్నారు. ఒకప్పుడు రాజీవ్ కుటుంబంతో అమితాబ్ బాగా సన్నిహితంగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏజేఎల్ లో వాటాలు ఉన్నవారంతా రాజీవ్, ఇందిరాగాంధీలకు అత్యంత సన్నిహితులే కావడం విశేషం. ఏజేఎల్ కు ఇచ్చిన రుణాన్ని యంగ్ ఇండియాకు బదలాయించి సోనియా, రాహుల్ లు ఆ సంస్థకు చెందిన 2 వేల కోట్లను మింగేసే ప్రయత్నం చేస్తున్నారన్నది కేసు. ఇప్పుడు ఇందులో అమితాబ్ పేరు కూడా బయటకు రావడంతో మరింత వేడి పెరిగింది.
Tags:    

Similar News