పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గత పర్యటన కంటే భిన్నమైన ప్రసంగం చేశారు. గతంలో ఏపీకి వచ్చినపుడు ఇప్పటివరకు విడుదల చేసిన నిధులు అంటూ న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా కలిపేసి వివరించిన షా ఇపుడు గత పరిపాలన తాలుకు తప్పులు అంటూ ఏపీ ప్రత్యేక హోదాపై దాటవేసే దోరణి ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రం ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించే విషయంలో కాంగ్రెస్ - వైకాపాలు రకరకాల ప్రచారాలు చేస్తున్నాయని షా మండిపడ్డారు. వాస్తవానికి ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని నిర్ణయం తీసుకున్న 14వ ఆర్థిక సంఘాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించిందన్నారు. ఆ నిర్ణయం ఫలితంగానే ప్రత్యేక హోదా ఇప్పుడున్న రాష్ట్రాలకు కూడా దూరమయ్యే పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఆలోచనతోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కలిపి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని అమిత్ షా చెప్పారు.
ఇంతకుముందు రాష్ట్రానికి వచ్చిన సమయంలో చెప్పిన 1.40 లక్షల కోట్ల ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, మరికొన్నింటిని నెలవారీ ప్రారంభిస్తున్నామని అమిత్ షా వివరించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని, దీనికి అవసరమైన రూ.16 వేల కోట్లను సమకూరుస్తున్నామని చెప్పారు. ఇలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో బీజేపీ-టీడీపీ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, ప్రజలంతా బీజేపీకి బాసటగా నిలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి మరింత బలోపేతం కావడానికి సహకరించాలని కోరారు. బీజేపీకి బూత్ స్థాయి నుంచి ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. హిందీలో అమిత్‌షా చేసిన ప్రసంగాన్ని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి తెలుగులోకి అనువదించారు.
కాగా దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని అమిత్ షా చెప్పారు. గత ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని, మోడీ సర్కారు వచ్చి రెండున్నరేళ్లు అయినా ఒక్క అవినీతి ఆరోపణా రాకపోవడం ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ముందుగా ప్రయోజనం అందేది రైతులకేనన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రస్తుతం యూరియా ప్రతీ ఒక్కరికీ అవసరమైన స్థాయిలో అందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. యూరియాకు వేప పూత పూయాలని మోదీ తీసుకున్న నిర్ణయం కారణంగా యూరియా పక్కదారి పట్టకుండా కొరత లేకుండా రైతులకు అందుతోందన అమిత్ షా అన్నారు. అలాగే భూసార పరీక్ష కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు మేలు చేసిందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సించాయి యోజన కూడా రైతులకు ప్రయోజకారిగా వుందని, ఇక విపత్తుల కారణంగా నష్టాలు సంభవించిన సమయాల్లో రైతులకు ఇచ్చే పరిహారం శాతాన్ని కూడా గణనీయంగా పెంచిందన్నారు. ఈ-మండీ విధానాన్ని ప్రవేశపెట్టి రైతులకు మెరుగైన ధర ఎక్కడ లభ్యమైతే అక్కడ అమ్ముకునే వీలు కల్పించిందన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా విత్తు నుంచి ఉత్పత్తి మార్కెట్ కు వెళ్లే వరకు కేంద్రం భద్రత కల్పించిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ విపక్షాలు రైతులు నష్టపోతారని చెబుతున్నాయని, అది అవాస్తవమన్నారు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్ లో ధరలు దిగి వస్తాయని, అందువల్ల ముందుగా లాభపడేది రైతులేనని అమిత్ షా చెప్పారు. మన సైన్యం పాకిస్తాన్ లోకి చొరబడి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి విజయవంతంగా బయటకు వచ్చిందన్నారు. ఈ విషయంలో దేశమంతా మోడీకి అభినందనలు తెలిపితే రాహుల్ గాంధీ మాత్రం సైన్యం రక్తంతో వ్యాపారం చేస్తున్నారంటూ విమర్శలు కురిపించారని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/