సర్కారుకు పరిష్కారం కావాల్సిన అమరావతి సమస్యగా మారిందే

Update: 2022-03-04 08:30 GMT
కొన్ని గ్రామాల స‌మ‌స్య ఇది అని రాష్ట్రం స‌మ‌స్య  కాద‌ని అప్ప‌ట్లో వైసీపీ అంటుంటేంది.ఇంకా చెప్పాలంటే ఓ సామాజిక‌వ‌ర్గం ఉన్న‌తికే రాజధాని కానీ అమ‌రావ‌తి మాత్రం అంద‌రిదీ కాదు అని తేల్చేసింది.కానీ నిన్న‌టివేళ అమ‌రావ‌తి అంద‌రిదీ ఆంధ్రుల అంద‌రిదీ అని తేలిపోయింది.ఇక సీఎం జ‌గ‌న్ ఏమ‌యినా మాట్లాడినా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మోసుకుని వెళ్లాల్సి ఉంటుంద‌ని సంబంధిత రైతులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.

మూడుపంట‌లు పండే నేల‌లు..ముచ్చ‌ట గొలిపే నేలలు.. రైతు హుందాగా బ‌త‌క‌వ‌చ్చు.కానీ రాజ‌ధాని నిర్మాణం కోసం కొంద‌రు ముందుకు వ‌చ్చి భూములు ఇచ్చారు.ముఖ్యంగాచంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతోనే ఆ ప‌ని చేశాం అని కూడా చెప్పారు.త‌ప్పేం లేదు ఎవ్వ‌రైనా భూములు ఇవ్వ‌వ‌వ‌చ్చు. నిబంధ‌నల  అనుసారమే ఆ రోజు  ప్ర‌భుత్వం స‌మీక‌ర‌ణ చేసింది. మ‌రి! ఆ రోజు వైసీపీ ఎలాంటి వ్య‌తిరేక‌తా చెప్ప‌లేదు.పోనీ నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ప్పుడు కూడా ఊరుకుంది. ఆ రోజు ఒక్క ప్ర‌క‌ట‌న కూడా రాజ‌ధానికి వ్య‌తిరేకంగా చేయ‌లేదు.ఇవ‌న్నీ త‌లుచుకుంటూ ఉండ‌గానే కొత్త రాజ‌ధాని విశాఖ అంటూ వైసీపీ హ‌డావుడి చేసింది. ఇక్క‌డ అభివృద్ధికి ల‌క్ష కోట్లు కావాల‌ని మెలిక పెట్టింది.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కొత్త రాజ‌ధాని పాత రాజ‌ధాని అంటూ ఏమీలేవు. ఒక్కటే రాజ‌ధాని  అదే అమ‌రావ‌తి.అది రైతుల‌కే కాదు అంద‌రికీ సుంద‌ర స్వ‌ప్న‌మే.ఆ స్వ‌ప్న సాకారానికి ప్ర‌భుత్వం కృషి చేయాలి. వీళ్ల‌నే కాదు నిర‌స‌న‌కారులెవ్వ‌రినీ హేళ‌న చేయ‌కూడదు అని ప్ర‌జాస్వామిక వాదులు హిత‌వు చెబుతున్నారు.ముఖ్యంగా మ‌హిళ‌లే ముందుండి న‌డిపిన ఉద్య‌మమే అయిన‌ప్ప‌టికీ పోలీసులు మాత్రం అస్స‌లు విచ‌క్ష‌ణ పాటించలేదు. మీడియానూ తిట్టిపోశారు. ఇవ‌న్నీ జ‌గ‌న్ ను రేప‌టి వేళ ఇబ్బందులు పాల్జేసేందుకు వీలుంది.జ‌న‌సేన కూడా అమ‌రావ‌తికే మ‌ద్ద‌తుగా ఉంది. ఇది ఆంధ్రుల హ‌క్కు అని అంటోంది. బీజేపీ అయితే ఏకంగా కేంద్రం నుంచి తాజాగా 1214 కోట్ల రూపాయ‌లు అమ‌రావ‌తి పేరిటే ఇచ్చింది.అంటే కేంద్రం కూడా రాజ‌ధాని అమ‌రావ‌తే అని ఒప్పుకుంటోంది కానీ వైసీపీ మాత్రం వింత‌డ‌వాదం వినిపిస్తోంది అని టీడీపీ కౌంట‌ర్ ఇస్తోంది.


Tags:    

Similar News