బీజేపీ యువనేత - మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటే... తన సొంత పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లోని నేతలకు కూడా గౌరవమే. ఎందుకంటే ఏనాడూ ఆయన నోరు జారి మాట్లాడింది లేదు. అంతేనా... చాలాకాలం పాటు రాజకీయాల్లో ఉన్నా ఆయన ఇప్పటిదాకా మిస్టర్ క్లీనే. ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే... సాదాసీదా జీవనానికే ప్రాధాన్యమిస్తారు. గాయనిగానే కాకుండా నాట్యంలోనూ ప్రవేశం ఉన్న ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ కూడా పెద్దగా వివాదాల్లో చిక్కుకున్న దాఖలా లేదు. అయితే నిన్న ముంబైలోని పత్రికల పతాక శీర్షికల్లో కనిపించిన ఓ ఫొటోపై ఇప్పుడు రచ్చరచ్చ జరుగుతోంది. హిందూ సంఘాలు - విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ ఫొటోను ఆసరా చేసుకుని ఫడ్నవీస్ ఫ్యామిలీపై దాడిని మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి... ఈ ఒక్క ఫొటోను చూపి ఫడ్నవీస్ తో పాటు బీజేపీపైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇక బీజేపీలో కొందరు నేతలు కూడా ఈ ఫొటోపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
అసలు ఆ ఫొటోలో ఏముందనేగా? అదేం కొత్త విషయమేమీ కాదు... అభ్యంతరకరమైన విషయం అంతకన్నా ఏమీ కాదు. ఓ వీడియో ఆల్బమ్ చిత్రీకరణలో భాగంగా అమృతా... బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి స్టెప్పులేస్తూ ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. మంగళవారం జరిగిన షూటింగ్ సందర్భంగా ఈ ఫొటో తీశారు. ఈ ఫొటో నేషనల్ మీడియాలో బుధవారమే పబ్లిష్ అయ్యింది. సీఎం సతీమణి అయినా... తన అభిరుచుల మేరకు ఓ వీడియో ఆల్బమ్ లో నటిస్తున్న అమృతను అంతా మెచ్చుకున్నారు కూడా. సినీ జనం అయితే అమృతను మరింతగా ప్రోత్సహించారు. అయితే కొందరు బీజేపీ నేతలు, కొన్ని హిందూవాద సంస్థలతో పాటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా జీర్ణించుకోలేకపోతున్నాయి. సీఎం సతీమణి అయి ఉండి... పొట్టి డ్రెస్సుల్లో సీని నటులతో కలిసి స్టెప్పులేంటి అన్నట్లుగా ఆ విమర్శలు సాగాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే... ఈ ఫొటోకు - పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టి ఆరోపణలు గుప్పించింది. ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చి సదరు ఫొటోపై విరుచుకుపడ్డారు. *నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులతో 80 మంది చనిపోయారు. అయితే నోట్ల రద్దుతో అసలు లబ్ది పొందిన వ్యక్తి మాత్రం బిగ్ బీతో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ అయినా, ప్రధాని అయినా గుర్తించారా?* అంటూ ఆయన ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/