అమ్మ అనారోగ్యం మొదలు తిరిగి రాని లోకాలకు పయనం కావటం.. తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నే కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఒక మహిళ తాను జయలలిత కుమార్తెనని తెర మీదకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరణించే వరకూ కుమారిగా ఉన్న అమ్మకు తాను కుమార్తెనని ఆమె చెబుతున్నారు.
బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ తాజాగా తెర మీదకు వచ్చారు. తాను జయలలిత కుమార్తెనని.. కావాలంటే డీఎన్ ఏ టెస్ట్ చేయించుకోవటానికైనా తాను సిద్ధమని ఆమె ప్రకటించటం కలకలంగా మారింది. అంతేకాదు.. తన తల్లిది సహజ మరణం కాదన్న ఆమె.. నిజాలను రాబట్టేందుకు సీబీఐతో కలిసి దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఇందులో భాగంగా రాష్ట్రపతి కోవింద్ తో పాటు ప్రధాని మోడీకి ఆమె లేఖలు రాశారు. సదరు లేఖలో ఉన్న సమాచారాన్ని చూస్తే.. తాను జయలలిత కుమార్తెనని ఆమె చెప్పుకున్నారు. తల్లిదండ్రుల్ని కోల్పోయి మానసికంగా కుంగిపోయిన దశలో అలనాటి సినీ హీరో శోభన్ బాబు సహచర్యంతో తన తల్లి కోలుకుందన్నారు. ఆ సమయంలో వారిద్దరి ప్రేమకు చిహ్నంగా తాను పుట్టినట్లుగా ఆమె చెప్పారు. సామాజిక కట్టుబాట్ల నేపథ్యంలో ఇద్దరికి పెళ్లి జరగలేదని చెప్పిన ఆమె.. తాను పుట్టిన తర్వాత జయ సోదరి శైలజ.. ఆమె భర్త సారథిలకు తన బాధ్యతను అప్పగించారన్నారు.
తన కుమార్తె నన్న విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ జయ ఒట్టు వేయించుకున్నారని పేర్కొన్నారు. 1996లో జయను కలవాల్సిందిగా శైలజ తనకు చెప్పారన్నారు. తాను జయను కలిసినప్పుడు నా వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారని.. అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారన్నారు. తర్వాతి కాలంలో ఆమెను పలుమార్లు తాను కలిసినట్లుగా చెప్పారు. అయితే.. తానే తల్లినని జయలలిత ఎప్పుడూ తనతో చెప్పలేదన్నారు.
జయ మరణం తర్వాత దీప.. దీపక్ లు జయ ఆస్తులకు వారసులమని చెబుతున్నారని.. అందుకు సంబంధించిన వార్తల్ని చూసిన తన బంధువు అమెరికా నుంచి ఫోన్ చేశారన్నారు. తాను జయలలిత సంతానాన్ని అని చెప్పారని.. బెంగళూరులోని మరో బంధువు కూడా అదే విషయాన్ని చెప్పారన్నారు. తన తల్లిని కొందరు కుట్ర చేసిన చంపినట్లుగా ఆమె ఆరోపించారు. చిన్నమ్మ.. ఆమె భర్త నటరాజన్ లు తన తల్లి చావుకు కారణమన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. తనకు పుట్టిన బిడ్డ గురించి ఎవరికి చెప్పకూడదని జయలలిత ఒట్టు వేయించుకున్నాక కూడా ఇంత మందికి ఎలా తెలిసినట్టు? ఏమైనా.. జయ కూతురునంటూ ఎంట్రీ ఇచ్చిన మహిళ అమ్మ ఎపిసోడ్ లో మరో కొత్త సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.