రైల్వేస్ తో బిజినెస్ డీల్‌.. చాలా సింఫుల్‌!

Update: 2017-10-25 16:49 GMT
నిత్యం కోట్లాదిమందిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చటంలో ఇండియ‌న్ రైల్వేస్‌ కు ఉన్న ట్రాక్ రికార్డు దేశంలో మ‌రే ర‌వాణా సంస్థ‌కు లేద‌ని చెప్పాలి. వేలాది రైళ్ల‌ను నిత్యం తిప్ప‌టం.. కోట్లాది మందికి సాయంగా ఉన్న ఇండియ‌న్ రైల్వేస్ లో వ్యాపారానికి కొద‌వ‌లేదు. కాకుంటే.. ఇండియ‌న్ రైల్వేతో క‌లిసి బిజినెస్ చేయాలంటే ఎలా అన్న‌ది చాలామందికి వేధించే ప్ర‌శ్న‌.

అలాంటి వాటిని స‌ర‌ళ‌త‌రం చేసే ప‌ని చేప‌ట్టింది ఇండియ‌న్ రైల్వే. త‌మ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా త‌మ‌తో బిజినెస్ చేయాల‌నుకునే ఔత్సాహికుల్ని సాద‌రంగా ఆహ్వానిస్తుంది. త‌మ ద‌గ్గ‌రున్న ప్ర‌పోజ‌ల్‌ ను ట్విట్ట‌ర్ అకౌంట్ ట్వీట్ ద్వారా వెల్ల‌డిస్తే.. దానికి వెంట‌నే బ‌దులిస్తోంది.

ఇప్ప‌టికే ఈ త‌ర‌హాలోప‌లు ప్ర‌ముఖ కంపెనీలు ఇండియ‌న్ రైల్వేస్‌ కు త‌మ వ్యాపార ఆలోచ‌న‌ల్ని పంచుకోవ‌టం.. అందుకు రైల్వే ఓకే చెప్పేయ‌టం క‌నిపిస్తుంది. తాజాగా ప్ర‌ముఖ డైరీ ఉత్ప‌త్తుల సంస్థ అమూల్ త‌మ వ్యాపార ఆలోచ‌న‌ను ట్విట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేసింది.

దీనికి స్పందించిన ఇండియ‌న్ రైల్వేస్ ఓకే చెప్పేసింది. మ‌రిక ఆల‌స్యం ఎందుకు.. మీకున్న వ్యాపార ఆలోచ‌న‌ల్ని ఇండియ‌న్ రైల్వేస్ తో షేర్ చేసుకుంటే చాలు. వాటిని ప‌రిశీలించి త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తారు. మ‌రిక‌.. ఆల‌స్యం ఎందుకు వెంట‌నే ప్ర‌య‌త్నించండి మ‌రి.  


Tags:    

Similar News