దేశంలో ఎక్కడికైనా వెళ్లండి. ఎలాంటి మార్పు లేకుండా కామన్ గా ఉండేది ఏమైనా ఉందా? అంటూ అది.. ఆటోవాలాల ఆరాచకమన్న మాటను చెబుతుంటారు. దేశ వ్యాప్తంగా విస్తారంగా తిరిగిన వారికి అది నిజమేననిపిస్తుంటుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆటోవాలాల ఆరాచకం ఒకేలా ఉంటుందని కొందరు విమర్శిస్తుంటారు. దీన్ని పలువురు ఆటోవాలాలు తప్పు పడతారు. తాము తేరగా దొరుకుతామని.. తమను అలా తప్పు పట్టేస్తుంటారని.. తప్పుగా అర్థం చేసుకుంటారని చెబుతుంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్రలోని ఐటీ నగరమైన ఫూణెలో దిమ్మ తిరిగే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒక టెకీకి ఆటో డ్రైవర్ రూ.4300 ఛార్జ్ వేసి భారీ షాకిచ్చాడు. ఇదెలా జరిగిందన్న విషయంలోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తొలిసారి ఫూణె వచ్చాడు. కత్రజ్ ఏరియాలో దిగిన అతగాడు క్యాబ్ బుక్ చేసుకోవటానికి ట్రై చేసి.. తప్పని పరిస్థితుల్లో ఆటోలో వెళ్లాలని డిసైడ్ అయ్యాడు.
రోడ్డు మీద వెళుతున్న ఆటోని ఆపాడు. ఎరవాడ వెళ్లాలని అడిగితే ఓకే చెప్పాడు. ఆటోలో తాను కాకుండా వేరే వారు ఉండటంతో.. ఎవరని అడిగితే.. ఆటో డ్రైవర్ తాగి ఉన్నాడని.. కొత్త రూల్ నేపథ్యంలో అతన్ని వెనుక ఉంచి తాను ఆటో నడుపుతున్నట్లు చెప్పాడు. సర్లే అని సదరు టెకీ సర్దుకొని ఆటో ఎక్కాడు.
కట్ చేస్తే.. 18 కి.మీ. ప్రయాణం తర్వాత తన గమ్యాస్థానానికి చేరుకున్నాడు సదరు టెకీ. ఎంతంటే.. రూ.4300 అని ఆటోవాలా చెప్పటంతో.. తాను తప్పుగా విన్నాననుకొని మళ్లీ అడగటం.. మీరు విన్నది కరెక్టే రూ.4300 అంటూ దురుసుగా బదులివ్వటంతో అవాక్కు అయ్యాడు. అంత మొత్తం ఎందుకవుతుందంటే.. సిటీలో పోలీసులు ట్రాఫిక్ రూల్స్ మార్చేశారని.. సిటీలోకి ఆటో రావాలంటేనే రూ.600 అవుతుందని.. తాము చెప్పినంత ఇవ్వాలంటూ దబాయింపుతో పాటు.. బెదిరింపులకు దిగారు. దీంతో.. వారు అడిగినంత ఇచ్చేసి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. చివరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. సదరు ఆటోవాలాను తాము తప్పక పట్టుకుంటామని ఫూణె పోలీసులు భరోసా ఇచ్చారు. మరేమవుతుందో చూడాలి.