ఈ మధ్య కాలంలో ఇంట్లో చేసుకోవడం కంటే , బయటకి వెళ్లి ఏదైనా పెద్ద రెస్టారెంట్స్ లో తినడం కానీ , ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తినడం బాగా అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో పేరున్న రెస్టారెంటుకి వెళ్లి తినేస్తుంటారు. కొన్ని కొన్ని రెస్టారెంటులో మధ్యాహ్నం టేబుల్ దొరకాలి అన్నాకూడా చాలా కష్టపడాలి. అలాంటి హోటల్స్ అంటే అక్కడ శుభ్రత కూడా మరో లెవెల్ లో ఉంటుంది అని చాలామంది భావిస్తారు. కానీ, అన్ని రెస్టారెంటులో నాణ్యంగా ఉంటుందని అనుకుంటే మన పొరపాటే. దీనికి తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ షాపింగ్ కాంప్లెక్సు లో దక్షిణాది వంటలకు కేరాఫ్ గా పిలిచే ఓ హోటల్ లో దోశ సాంబరు తింటున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. దోశను సాంబారులో ముంచుకుని తింటుండగా అతడికి ఏదో గట్టిగా తగిలింది. దీంతో దాన్ని బయటకు తీసి చూశాడు. అంతే, అతడి కడుపులో తిప్పినట్లయ్యింది. కారణం, ఆ సాంబరులో చచ్చిపోయిన బల్లి. అది కూడా సగమే ఉంది. దీంతో అతడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలాగే ,ఆ రెస్టారెంట్ మేనేజరును పిలిచి.. బల్లిని తన నోట్లో నుంచి తీశానని చెప్పాడు. అయితే, బయటకు తీసేసరికి సగం బల్లే ఉందని, మిగతా సగం తానే తిన్నానా లేదా మిగతావారికి వేశారా అని ప్రశ్నించారు. ఆ మిగతా సగం హోటల్ కిచెన్ సాంబారులో ఉందేమో వెతకండి అంటూ రచ్చ చేశాడు . బల్లి విషపూరితమైన జీవి, ఇది ఆహారంలో పడినా.. తిన్నా చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హోటల్‌లోని సీసీటీవీ ఫూటేజ్‌లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.