ఆనం వివేకానంద రెడ్డి....వివాదాస్పద, ఆసక్తికరమైన ప్రకటనలకు కేరాఫ్ అడ్రస్ అయిన నెల్లూరుకు చెందిన ఈ కాంగ్రెస్ మాజీ నాయకుడు మరోమారు తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తనదైన శైలిలో ముగ్గులోకి లాగి కొత్త రచ్చను రాజేశారు. చంద్రబాబును భయపెట్టే ఏకైక వ్యక్తి ఆయనొక్కరే అంటూ తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. బాబును భయపెట్టగల ఏకైక వ్యక్తి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరేనని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
పవన్‌కళ్యాణ్ కు చంద్రబాబు ఆ రేంజ్‌లో భయపడటం వెనక కారణం ఏంటో వారిద్దరికే తెలుసునని ఆనం వ్యాఖ్యానించారు. ఆ రహస్యం ఏమిటో పవన్ లేదా చంద్రబాబు వెల్లడించాలని అన్నారు. ఆనం ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ కు భూముల కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం భూ సేకరణ చట్టం తెచ్చేందుకు సిద్ధపడినపుడు...పవన్ కళ్యాణ్ దాన్ని నిరసిస్తూ ప్రకటన చేశారు. అనంతరం ప్రభుత్వం తన నిర్ణయం నుంచి వెనక్కుతగ్గింది. ఈ నేపథ్యంలో పవన్ సత్తా గురించి రాజకీయాల్లో చర్చ జరిగింది. ఆ పరిణామాన్ని గుర్తుచేసుకుంటూ ఆనం ఇపుడు తాజా కామెంట్లు చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇదిలాఉండగా...వైసీపీ ఆనం వివేకానందరెడ్డి, ఆయన సోదరుడు రామనారయణ రెడ్డి చేరికపై ప్రశ్నించగా తన మనసులో మాటను బయటపెట్టారు. తాను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న నాయకుడినని..వైసీపీలో చేరడం లేదని ప్రకటించారు.