ఆనం వివేకాలో అమీబా పోలికలు

Update: 2015-12-02 09:55 GMT
రాజకీయ నాయకులను చూస్తుంటే వారు అమీబా వర్గానికి చెందినవారేమో అనిపిస్తుంది... అమీబా అనే జీవికి నిర్దిష్ట రూపముండదు ఏ ఆకారంలోనైనా ఉంటుంది. ఎక్కడైనా రూపం మార్చుకుని ఇమిడిపోతుంది. రాజకీయ నాయకులు కూడా అంతే, నిన్నటివరకు దుమ్మెత్తిపోసినవారి పంచలోనే చేరగలరు.. వారిని మెచ్చుకుని వారి శత్రువులపై విరుచుకుపడగలరు. ఇది ఎన్నోసార్లు నిరూపణ అయిన విషయమే అయినా నోరున్న నేతలు పార్టీలు మారినప్పుడతంతా మరోసారి చర్చకొస్తుంటుంది. తాజాగా ఆనం సోదరులు బుధవారం ఉదయం టీడీపీలో చేరిన తరువాత ఆనం వివేకా మాటలు విన్నవారికి ఈయన నిన్నమొన్నటి వివేకాయేనా అన్న అనుమానం కలగక మానదు.

కొద్దికాలం కిందట వైసీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను చెడామడా తిట్టిన వివేకా ఆ తరువాత కాంగ్రెస్ లోకి రాగానే ఆ పార్టీ పాలసీ ప్రకారం చంద్రబాబును తిట్టడం ప్రారంభించారు. తాజాగా ఆయన టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ ను టార్గెట్ చేశారు. నిన్నమొన్నటి వరకు చంద్రబాబును తిట్టిన నోటితోనే ఆయన ఇప్పుడు జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఏపీని అభివృద్ధి చేయగలిగింది చంద్రబాబు మాత్రమేనంటూ బాబును భుజాన వేసుకుంటే అదే సమయంలో జగన్ పై నిప్పులు కురిపించారు. రాజశేఖరరెడ్డి కొడుకునని చెప్పుకునే అర్హత జగన్ కు లేదని.. జగన్ వల్ల రాజశేఖరరెడ్డికి  ఉన్న మంచి పోరు కూడా పోయిందని ఆయన అంటున్నారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా చంద్రబాబుకు కాక ఇంకెవరికి ఉందని వివేకా అంటున్నారు.
Tags:    

Similar News