కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినా ఎలాంటి ప్రయోజనం దక్కించుకోని నెల్లూరు సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి వైసీపీలో చేరనున్నట్లు ఆ జిల్లాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తారని ఆశించినా చంద్రబాబు ఏమాత్రం కరుణించకపోగా తమకు బద్ధ శత్రువైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని మంత్రిని చేయడంతో వివేకా కొన్నాళ్లుగా మండిపడుతున్నారు. వివేకా సోదరుడు రాంనారాయణ రెడ్డి కూడా ఆగ్రహంగానే ఉన్నప్పటికీ ఆయన వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారని... కానీ, వివేకా మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారని అంటున్నారు.
దీంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం వివేకాను ఆకర్షించేందుకు వైకాపాకు చెందిన కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నెల్లూరులో మరింత బలపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వైకాపా ఎత్తుగడల్లో భాగంగా, రెండు రోజుల క్రితం భూమన స్వయంగా ఫోన్ చేసి ఆనం వివేకాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరితే, అందరమూ కలసి పని చేసుకోవచ్చని ఆయన ప్రతిపాదించినట్టు తెలిసింది.
టీడీపీలో చేరి 15 నెలలైనా, ఇంతవరకూ ఎటువంటి పదవులు దక్కకపోవడం, తెలుగుదేశం నేతలతో పడక, ఇమడలేక పోతున్నట్టు ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన, త్వరలోనే వైకాపా కండువా కప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో అటు ఆనం సోదరుల నుంచిగానీ, ఇటు వైకాపా నుంచిగానీ ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రానప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఇది హాట్ టాపిగ్గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/